By: ABP Desam | Updated at : 03 May 2023 08:48 PM (IST)
వరుస వర్షాలతో రైతుకు తీరని కష్టం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతేరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. వరుసగా కురిసిన వానలు వరి పంట సహా ఇతర పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎంతో శ్రమ కోర్చి పండించిన పంటను అకాల వర్షం ముంచెత్తింది. కోతలకు సిద్దంగా ఉన్న పంట, కోసిన వరి ధాన్యం ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని సాలురా, బోధన్, నవీపేట్, పోతంగల్, డిచ్ పల్లి, సిరికొండ, ధర్పల్లి, మోపాల్ తదితర మండలాల్లో కళ్లాల్లో ఉన్న వరి ధాన్యం మొలకెత్తింది. పలు మండలాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడవటంతో ఎరుపు రంగులోకి మారింది.
ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో నెల కిందటే రైతులు వరి ధాన్యం కోశారు. కొనుగోళ్లు వేగవం,తం చేయాకపోవటంతో... కళ్లాల్లో ఉంచిన వరి ధాన్యం సైతం అకాల వర్షాలకు తడిసిపోయి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. వర్షంలో తడిసిన ధాన్యం మొలకెత్తటంతో అన్నదాతలు మరింత నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించినా... సరైన సమయంలో తూకాలు వేయకపోవటంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోళు కేంద్రాల్లో తీసుకోవటం లేదని అంటున్నారు అన్నదాతలు.
ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి వరుసగా సాయంత్రాల్లో వర్షం కురుస్తోంది. అత్యధికంగా బోధన్ మండలంలో వాన కురిసింది. అధికంగా వర్షం కురిసిన మండలాల్లో వరి, కూరగాయలు, ఇతర పంటలు బాగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షం నీటికి ఆరబోసిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రోడ్లపై రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నా ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందంటున్నారు రైతులు. జిల్లాలో రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని లారీల్లోనే రోజుల తరబడి ఉంచుతున్నారు. దీంతో వర్షం కురిస్తే ఆ ధాన్యం తడుస్తోంది. తడిసిన ధాన్యం మొలకెత్తుతోందని రైతులు వాపోతున్నారు. దీంతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు అడిగిన రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు.
ఇంకా కొన్ని మండలాల్లో వరి ధాన్యం కోతకు ఉంది. కొద్దామకునే సమయానికి ఎప్పుడు వర్షంపడుతుందో నని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా వరకు వడగళ్ల వానకు గెల నుంచి ధాన్యం రాలిపోయింది. ఉన్న పంటను కొద్దామంటే వర్షం ఎప్పుడు దాడిచేస్తుందోనన్న భయంతో ఉన్నారు అన్నదాతలు. ఇదే అదునుగా హర్వెస్టర్ యజమానులు పంట కోసేందుకు గంటకు రూ.2,500 తీసుకుంటున్నారు. దీంతో రైతన్నకు భారంగా మారింది. ఇలా అన్ని విధాలుగా అన్నదాత నష్టపోవాల్సి వస్తోంది.
మరోవైపు వరితో పాటు మామిడి, ఇతర పంటలు కూడా తీవ్రంగా నష్టపోయారు రైతులు. పచ్చళ్లు పెట్టుకునే మామిడి రేటు పెరిగింది. వర్షానికి కూరగాయలు, ఆకు కూరలు కుళ్లిపోతున్నాయి. మొత్తానికి వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను మాత్రం ఆగం చేస్తున్నాయి. మరోవైపు తాము నష్టపోయిన పంటకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు రైతులు. ఇందుకోసం అధికారులు పక్కాగా పంట నష్టపోయిన లెక్కలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నారు అన్నదాతలు.
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!
Vemula Prashanth Reddy: తెలంగాణ దశాబ్ది సంబరాల నిర్వహణపై మంత్రి రివ్యూ, ప్రణాళిక ఇదీ
Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా
పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్ పెంచిన సర్కార్ - ఎంత శాతమంటే?
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి