Adilabad : ఆదిలాబాద్ RTC ప్రత్యేక పర్యాటక బస్సులు; అరుణాచలం, శ్రీశైలం యాత్రలకు సిద్ధం! తక్కువ ధరలో ఆధ్యాత్మిక యాత్రలు!
Adilabad RTC: ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ జిల్లాల నుంచి వివిధ ఆధ్యాత్మిక పర్యాటక స్థలాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీ రూపొందించారు.

Adilabad RTC Special Tourism Buses: మారుమూల ప్రాంతాల్లోని పల్లెలకు బస్‌లను నడపడటమే కాకుండా ప్రజలను పర్యాటక ప్రాంతాల్లో తిప్పేందుకు కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించింది. ఇది సిటీల్లో ఉన్న వారికే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది ఆర్టీసీ. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సరికొత్త ప్యాకేజీలను టీజీ ఆర్టీసీ పరిచయం చేసింది.
ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూనే ఆదాయ వనరులు పెంచుకునే దిశగా ఆలోచిస్తున్న ఆర్టీసీ ఈ ప్యాకేజీలు రూపొందించింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో స్పెషల్ సర్వీసులు నడపుతూ ప్రజల అభిమానం సంపాదించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే టూరిజయం డిపార్ట్మెంట్ ఒప్పందం చేసుకుంది. బస్‌లో తీసుకెళ్లినప్పటి నుంచి అక్కడ వసతి, దర్శనాలు, ఫుడ్ అన్నింటిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనుంది.
తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన
ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రత్యేక బస్‌లు నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్యత ఉన్న టెంపుల్స్‌ను సందర్శించేందుకు ప్రత్యేక ప్యాకేజీ రూపొందించారు. యాదగిరి గుట్ట, స్వర్ణగిరి, శ్రీశైలం, కాణిపాకం, అరుణాచలం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ఇలా చాలా ప్రదేశాలను సందర్శించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేశారు అధికారులు.
అరుణాచలం నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే ప్యాకేజీ ఇదే
అరుణాచలం సందర్శించాలనుకునే వాళ్లకు 5,200 రూపాయల నుంచి 3,350 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. శ్రీశైలం వెళ్లాలనుకుంటే పెద్దలకు 2,500 రూపాయలు వసూలు చేస్తే చిన్నారులకు 1,500 ఛార్జ్ చేస్తారు. ఆదిలాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లాలంటే పెద్దలకు 1,600 చిన్నారులకు 1,000 రూపాయలను వసూలు చేస్తారు.
అరుణాచలం వెళ్లే బస్ టైమింగ్స్
ఆదిలాబాద్ నుంచి అరుణాచలానికి వెళ్లే బస్‌లు ఈనెల 9న ఉదయం 11 గంటల బయల్దేరుతాయి. పదో తేదీ నాటికి అక్కడకు చేరుకుంటాయి. అక్కడ దర్శనం ఇతర ప్రదేశాల సందర్శన తర్వాత మళ్లీ తిరుగు పయణం 11వ తేదీన ప్రారంభమవుతుంది. 12వ తేదీ రాత్రి పది గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు.
శ్రీశైలం, యదగిరిగుట్టకు వెళ్లే బస్ టైమింగ్స్
శ్రీశైలం వెళ్లే బస్‌లు ఆదిలాబాద్‌లో 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. 12న ఉదయం 8 గంటలకు శ్రీశైలానికి చేరుకొని దర్శనం కల్పిస్తారు. మళ్లీ అదే రోజు సాయంత్రం తిరుగుపయనమవుతాయి. 12వ తేదీ ఉదయం 8 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటాయి. యాదగిరి గుట్ట వెళ్లాలనుకునే వారి కోసం 12న ఆదిలా బాద్ నుంచి బస్‌లు ఉంటాయి. ఉదయం 5 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు యాదరిగిగుట్టకు చేరుకుంటాయి. దర్శనాలు అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు తిరుగు పయనమవుతాయి. 13వ తేదీ ఉదయం ఐదు గంటలకు ఆదిలాబాద్‌లో ఉంటాయి.
వీటిని బుక్ చేసుకోవాలనుకే వాళ్లు నేరుగా ఆదిలాబాద్ డిపో మేనేజర్‌ను సంప్రదించవచ్చు. పూర్తి వివరాలు కావాలంటే 7382840068, 7382840115, 9492767879 నంబర్లకు ఫోన్ చేస్తే చెబుతారు. ఆన్‌లైన్‌లో కూడా ఈ స్పెషల్ సర్వీస్‌లో సీట్లు బుక్ చేసుకోవచ్చు.





















