News
News
X

KA Paul: మునుగోడు యువతకు కేఏ పాల్ బంపర్ ఆఫర్! ఆరోజు ఈ ప్లేస్‌కి వస్తే ఆ రెండూ ఫ్రీ - వీడియో

నిరుద్యోగ యువత తాకిడి ఎక్కువగా ఉంటే తాను మరింత మందికి ఉచితంగా పాస్ పోర్టులు, ఫ్రీగా అమెరికన్ వీసాలు స్పాన్సర్ చేస్తానని చెప్పారు.

FOLLOW US: 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. త్వరలో తాను 59వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నానని, ఆ సందర్భంగా మునుగోడులోని 59 మంది నిరుద్యోగ యువకులు, యువతులకు ఉచితంగా పాస్ పోర్టులు, ఫ్రీగా అమెరికన్ వీసాలు స్పాన్సర్ చేస్తానని హామీ ఇచ్చారు. తన ఆహ్వానం మేరకు వచ్చిన నిరుద్యోగులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి 59 మందికి ఈ అవకాశం కల్పిస్తానని, వారికి మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేస్తానని ప్రకటించారు.

సెప్టెంబరు 25 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ శ్రీవార్ హోమ్స్ గ్రౌండ్స్‌కు రావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సహా రావచ్చని అన్నారు. నిరుద్యోగ యువత తాకిడి ఎక్కువగా ఉంటే తాను మరింత మందికి ఉచితంగా పాస్ పోర్టులు, ఫ్రీగా అమెరికన్ వీసాలు స్పాన్సర్ చేస్తానని చెప్పారు. తాను ఒక బీసీ వ్యక్తి అయి ఉండి, ఒక దళిత మహిళను వివాహం చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. కాబట్టి, నిరుద్యోగుల బాధలు తనకు తెలుసని అన్నారు.

ఇంటికొక ఉద్యోగం ఇప్పిస్తానని సీఎం కేసీఆర్‌, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ యువతను మోసం చేశారని కేఏ పాల్ విమర్శించారు. వారి మాటలు నమ్మకుండా మనల్ని మనం మెరుగుపర్చుకుందామని చెప్పారు. ‘‘మీ డబ్బులు నాకు అవసరం లేదు. నియోజకవర్గాన్ని, మన రాష్ట్రాన్ని మనమే మంచిగా చేసుకుందాం. నా కార్యక్రమానికి వస్తాను అనే వాళ్లు కింద కామెంట్ చేయండి. ఎంత మందిని తీసుకొస్తారో కూడా కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి’’ అని కేఏ పాల్ పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా తాను కానుకగా అందిస్తున్న అవకాశాన్ని మునుగోడు యువత ఉపయోగించుకోవాలని పాల్ కోరారు.

కేఏ పాల్ కు ఈసీ షాక్!
ఇటీవలే కేఏ పాల్ కు ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీని చేర్చింది. 2019లో ఏపీకే పరిమితమైన కేఏ పాల్ తనకు అవకాశం ఇవ్వాలని హంగామా చేశారు. ఇక తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక తెలంగాణాలోనూ ప్రత్యామ్నాయం నేనే అని రచ్చ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేంద్రంలోనూ కీలకపాత్ర పోషించబోతున్నామని పాల్ తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో ఈసీ ఆయనకు ఝలక్ ఇచ్చింది. 

కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని 2008లో రిజిస్టర్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పాల్ ప్రకటించటంతో ఈసీ ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించింది. 2019లో ప్రజాశాంతి పార్టీ నుంచి 11 మంది పోటీ చేశారు. కానీ ఎవరూ గెలవలేదు. ఇక గెలుపు విషయానికి వస్తే.. పాల్ పార్టీకి కనీసం ఒకటి, రెండు స్థానాల్లో కూడా అభ్యర్థులు లేరు. అప్పుడు కేఏ పాల్ పార్టీకి కేవలం నాలుగు వేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి.

Published at : 20 Sep 2022 02:37 PM (IST) Tags: Unemployment KA Paul Prajashanthi Party Munugode news KA Paul in Munugode

సంబంధిత కథనాలు

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Revanth Reddy : చిప్పకూడు సాక్షిగా చెబుతున్నా, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా- రేవంత్ రెడ్డి

Revanth Reddy : చిప్పకూడు సాక్షిగా చెబుతున్నా, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా- రేవంత్ రెడ్డి

National Herald Case: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు ఈడీ నోటీసులు - ప్రచారంలో నిజమెంత !

National Herald Case: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు ఈడీ నోటీసులు - ప్రచారంలో నిజమెంత !

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

MS Dhoni:  ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం