అన్వేషించండి

Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం

Devi Navaratri Row | నల్లగొండ జిల్లా డిండి మండలంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన స్థలంపై రెండు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తి, మాటమాట పెరిగి పూజలు చేయకుండానే నిమజ్జనం చేశారు.

Devi Navaratri Row in Nalgonda | డిండి: తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో పోటీ పడి మీర దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తుంటారు. కానీ నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెం గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ వివాదం చోటుచేసుకుంది. గ్రామంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థలానికి సంబంధించి రెండు  వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు ముదిరి వివాదానికి దారితీశాయి. విగ్రహ ప్రతిష్ఠాపన స్థలం విషయంలో ఇరువర్గాలు పట్టుబట్టడంతో మాటమాట పెరిగి చివరికి ఆధిపత్య పోరుకు వెళ్లింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది.

ఈ వివాదం తీవ్రరూపం దాల్చడం, ఏ వర్గం వారు తగ్గకపోవడంతో అపశ్రుతి చోటుచేసుకుంది. దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముందే దుర్గామాత విగ్రహాన్ని కనీసం పూజలు కూడా నిర్వహించకుండానే నిమజ్జనం చేశారు. అప్పటికీ కొందరు వద్దురా.. ఇది దేవుడు, దేవతలకు సంబంధించిన కార్యక్రమం. విగ్రహాన్ని పూజలకు ముందే నిమజ్జనం చేయడం అరిష్టమని చెబుతున్నా వినిపించుకోకుండా చెరువలో నిమజ్జనం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. విగ్రమం నిమజ్జనం ఫలితంగా తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరగాల్సిన నవరాత్రి ఉత్సవాలు నిలిచిపోయాయి. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని భావించిన గ్రామస్థులు, భక్తులు ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం

పవిత్రమైన పండుగ వేళ రాజకీయ విభేదాలతో నవరాత్రి ఉత్సవాలను భగ్నం చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారిని కనీసం పూజలకు కూడా నోచుకోనివ్వకుండానే సాగనంపడం పట్ల అరిష్టం జరుగుతుందేమో అంటూ గ్రామంలో చర్చ మొదలైంది. గ్రామ ప్రశాంతతను దెబ్బతీస్తూ ఉత్సవాల నిర్వహణలో గొడవలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
Congress Candidates For MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Embed widget