అన్వేషించండి

Nalgonda Mystery: తలలు బాదుకుంటున్న ఊరి జనం.. అరిష్టమని పూజలు.. అసలేం జరుగుతుందంటే..

నల్గొండ జిల్లాలోని చందంపేట మండలంలో ఉన్న పాతుర్ తండా అనే గ్రామంలో గ్రామస్థులు ఓ వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బట్టలు, గడ్డి వాము వంటివి వాటంతట అవే తగలబడిపోవడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.

నల్గొండ జిల్లాలోని ఓ తండాలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తరచుగా వారి ఊరిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండడమే ఇందుకు కారణం. అయితే, ఈ వరుస అగ్ని ప్రమాదాలకు ఎవరు కారణమో ఎవ్వరికీ తెలియరావడం లేదు. గత 22 రోజులుగా ఇలా జరుగుతూనే ఉంది. దీంతో జనం చేతబడి ప్రభావం అయి ఉంటుందని జంకుతున్నారు. అయితే, దీన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు మంత్రగాళ్లను ఆశ్రయించారు. ఇక వారి దోపిడీ దౌర్జన్యం మరో స్థాయిలో ఉంది. పూర్తి వివరాలివీ..

నల్గొండ జిల్లాలోని చందంపేట మండలంలో ఉన్న పాతుర్ తండా అనే గ్రామంలో గ్రామస్థులు ఓ వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆ ఊరిలో ఎక్కడో ఓ చోట గడ్డి వాముకు నిప్పు అంటుకోవడం, బట్టలు, పశువుల కొట్టం వాటంతట అవే తగలబడిపోవడం వంటి ఘటనలు అత్యంత తరచుగా జరుగుతున్నాయి. ఎవరూ నిప్పు అంటించకుండానే వాటికి మంటలు అంటుకుంటున్నాయని గ్రామస్థులు తెలిపారు. అందుకు కారణాలు ఏంటో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు.

Also Read: Huzurabad Byelection : హూజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి వారిద్దరిలో ఒకరు..! కేసీఆర్ మొగ్గు ఎవరి వైపు..?

అంతుచిక్కకుండా ఉన్న ఈ అగ్ని ప్రమాదాలతో అల్లాడుతున్న తండా వాసులు చేసేది లేక.. ఏదో మాయ ఉందని భావించి.. మంత్రగాళ్లను ఆశ్రయించారు. వారు పూజల పేరుతో రూ.లక్షలు వసూలు చేశారు. మూడు జంతువులను కూడా బలిచ్చారు. అయినా అగ్ని ప్రమాదాలు ఆగలేదు. తండాలో ఏదో రోజు ఎక్కడో ఓ చోట నిప్పు రవ్వలు రేగి మంటలు అంటుకుంటూనే ఉన్నాయి. దీంతో వ్యవసాయ పనులు చేసుకునే జనం రోజూ పొలాలకు వెళ్లకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.


Nalgonda Mystery: తలలు బాదుకుంటున్న ఊరి జనం.. అరిష్టమని పూజలు.. అసలేం జరుగుతుందంటే..Nalgonda Mystery: తలలు బాదుకుంటున్న ఊరి జనం.. అరిష్టమని పూజలు.. అసలేం జరుగుతుందంటే..

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊరిలో ఎక్కడో ఓ చోట, ఏదో ఒక ఇంట్లో, ఏదో ఒక వస్తువు అగ్నికి ఆహుతి అవుతోంది. ఒకరోజు పొలంలో గడ్డివాము తగలబడితే, మరో రోజు ఇంటి ముందు ఉన్న పశువుల కొట్టం అంటుకుంటోంది. ఇంకోసారి నట్టింట్లో మంటలు అంటుకొని బట్టలు, దుప్పట్లు, మంచాలు కాలిపోతున్నాయని గ్రామస్థులు వాపోయారు. చివరికి తాళాలు వేసి ఉన్న ఇంట్లో నుంచి కూడా పొగలు వస్తున్నట్లుగా గ్రామస్తులు వెల్లడించారు.

రాత్రివేళ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే ఎవరో గుట్టుగా చేస్తున్నారనే సందేహం వస్తుంది.. కానీ, పట్టపగలే ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో ఈ మిస్టరీ ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. గత 22 రోజుల నుంచి ఈ ఘటనలు జరుగుతుండడంతో గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా అవుతోంది.

Also Read: Puvvada Ajay Kumar Cycle Yatra: ఖమ్మం రోడ్లపై మంత్రి సైకిల్‌ సవారీ... అభివృద్ధి పనులపై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి లైవ్‌ రివ్యూ

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget