Malla Reddy Holds Protest: ఆస్పత్రి ఎదుట మంత్రి మల్లారెడ్డి ధర్నా- హైపర్ టెన్షన్ వల్లే అంటున్న వైద్యులు!
Malla Reddy Holds Protest: మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సూరారం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మంత్రి అదే ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఐటీ అధికారులు తన కొడుకును కొట్టారంటున్నారు.
Malla Reddy Holds Protest: మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సూరారం ఆస్పత్రికో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. హైపర్ టెన్షన్ వల్లే ఆయన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తున్నారు. తమ కుమారుడిని చూడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రంతా సీఆర్పీఎఫ్ బలగాలతో తమ కొడుకును కొట్టించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. తన కుమారుడికి ఏమవుతుందోననే భయం తనను తీవ్రంగా బాధిస్తున్నట్లు తెలిపారు. ఐటీ సోదాల్లో నగదు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి ఇంటి వద్ద భారీ సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి సోదాలు కొనసాగిస్తున్నారు.
మంత్రి మల్లారెడ్డి దాడులపై ఏమంటున్నారంటే..?
ఐటీ అధికారులు తమపై కక్ష సాధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి మల్లారెడ్డి. తన కుమారుడిని కొట్టినందు వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారన్నారు. ఆయన్ని చూసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఈ ఉదయం ఆసుపత్రిలో చేరారు. చాతీలో నొప్పి రావడంతో సూరారం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని మీడియాలో చూసిన మల్లారెడ్డి ఆందోళనతో ఆసుపత్రికి బయల్దేరారు. మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. దీంతో వారిపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడికి బాగాలేదంటే చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎవరు అడ్డువచ్చినా తాను మాత్రం ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడిని చూసే తీరుతానంటూ చెప్పుకొచారు.
మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. దీంతో వారిపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడికి బాగాలేదంటే చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎవరు అడ్డువచ్చినా తాను మాత్రం ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడిని చూసే తీరుతానంటూ చెప్పుకొచారు. తన కుమారుడిని రాత్రంతా ఇబ్బంది పెట్టారని అందుకే ఆయన ఆసుపత్రిలో చేరారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే వెళ్లకుండా అడ్డుకోవడం ఇదెక్కడి దుర్మార్గమని ప్రశ్నించారు. ఆసుపత్రికి వెళ్లేందుకు మల్లారెడ్డి ప్రయత్నాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు ఐటీ అధికారులు. ఆయన కాన్వాయ్ తాళాలు తీసుకున్నారు. అందరి ఫోన్లు లాక్కున్నారు. వెళ్లేందుకు వీళ్లేదని చెప్పడంతో వారితో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. తమపై బీజేపీ కుట్ర చేస్తోందని... ఎలాంటి తప్పు చేయకున్నా నిన్నటి నుంచి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. తాము పేద పిల్లలకు చదువులు చెప్పించడం తప్పా అని ప్రశ్నించారు.
నిన్న ఉదయం నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న సోదాలు..
నిన్న ఉదయం నుంచి మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆఫీస్‌లు, కాలేజీలు, ఇళ్లపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన కుమారులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రఘునాథ్ రెడ్డి వద్ద రూ.2 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో రఘునాథ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. రఘునాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి రూ.2 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు. మరోవైపు, జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో మల్లారెడ్డికి వరుసకు అల్లుడు అయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా ఐటీ అధికారులు వెళ్లారు. సంతోష్ రెడ్డి తలుపు ఓపెన్ చేయకపోవడంతో ఐటీ అధికారులు వేచి చూస్తున్నారు. డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లే అలోచనలో ఐటీ ఆఫీసర్స్ ఉన్నారు.