అన్వేషించండి

'మీ వైఫల్యాలు చూడడానికి కర్ణాటక వెళ్లాల్సిన అవసరం లేదు' - డీకే శివకుమార్ కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

Minister KTR: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ వైఫల్యాలు చూడడానికి కర్ణాటక వరకూ వెళ్లాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ పై డీకే చేసిన విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ రాష్ట్రానికి వస్తే పథకాల అమలు చూపిస్తామంటూ డీకే వ్యాఖ్యానించగా, మీ వైఫల్యాలను చూడడానికి కర్ణాటక వరకూ వెళ్లాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కు అధికారమిస్తే అంధకారమేనని కర్ణాటక దుస్థితిని చూసిన తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. 

'మీ చేతగానితనానికి నిదర్శనం'

దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తుంటే, ఇక్కడికి ప్రచారానికి వచ్చి కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అది మీ చేతగానితనానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. 'ఓ వైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా, తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా.? మీ వైఫల్యాలు చూడడానికి అక్కడి వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే, ఇక్కడకు వచ్చి మీరు వారికి చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరిస్తున్నారు.' అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'హామీలతో అరచేతిలో వైకుంఠం'

కర్ణాటకలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని అక్కడి ప్రజలు క్షమించరని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం 5 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. 'మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు, ఛార్జీల వాతతో కర్ణాటక చీకటి రాజ్యంగా మారిపోయింది. కనీసం 5 గంటల కరెంట్ లేక అక్కడి రైతులే కాదు. వ్యాపార సంస్థలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మీ అన్న భాగ్య స్కీమ్ అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక, మీ వైఫల్యాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ అల్లాడిపోతున్నారు. రేషన్ పై కూడా సన్న బియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి, కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ దుస్థితికి తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది.' అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని కేటీఆర్ ప్రశంసించారు. మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి కర్ణాటకలో ఆర్టీసీని దివాళా తీయించారని, ఇది అక్కడి ఉద్యోగులకు పెను ప్రమాదంగా మారిందన్నారు. మహిళల ఖాతాల్లో డబ్బులేస్తామన్న హామీకి కూడా గ్రహణం పట్టించారని మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీశారని, వారి అవినీతి భాగోతం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. మళ్లీ తెలంగాణలో ఆ పార్టీని నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని అన్నారు. ఎందుకంటే, 'తెలంగాణ గడ్డ, చైతన్యానికి అడ్డా' అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read: కాంగ్రెస్ ప్రకటించిన రెండు లిస్టుల్లో షబ్బీర్ అలీ పేరే లేదు, కానీ నన్ను ఓడిస్తాడంట - సీఎం కేసీఆర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Manjummel Boys: 'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
YS Sharmila Letter To CM Jagan :  ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
Mrunal Thakur: ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Mumbai Indians Highlights | ఫ్రెజర్ ఊచకతో..ముంబయి 6వ ఓటమి | ABP DesamMalkajgiri Congress MP Candidate Sunitha Mahender Reddy | ఈటెల నాన్ లోకల్..నేను పక్కా లోకల్ | ABPKadiyam Srihari vs Thatikonda Rajaiah | మందకృష్ణ మాదిగపై కడియం శ్రీహరి ఫైర్.. ఎందుకంటే..! | ABPMamata Banerjee Falling Inside Helicopter |మరోసారి గాయపడిన దీదీ..ఏం జరిగిందంటే..! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Manjummel Boys: 'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
YS Sharmila Letter To CM Jagan :  ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
Mrunal Thakur: ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
IPL 2024: శివాలెత్తిన ఢిల్లీ బ్యాటర్లు, ముంబై లక్ష్యం 258
శివాలెత్తిన ఢిల్లీ బ్యాటర్లు, ముంబై లక్ష్యం 258
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
Embed widget