అన్వేషించండి

KTR Fire On Rahul : రాహుల్ కు సిగ్గు,శరం ఉంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి - కేటీఆర్ సవాల్

MLAs Chori: ఓట్ల చోరీ కంటే ఎమ్మెల్యేల చోరీ పెద్దదని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీకి సిగ్గూశరం ఉంటే పదిమందితో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు.

Telangana MLAs Chori:   ఓట్ చోరి కంటే ఎమ్మెల్యేల చోరి పెద్ద నేరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.  ఎమ్మెల్యేల చోరిపై మాట్లాడకపోవడం రాహుల్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని..  పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తేనే ఓట్ చోరిపై మాట్లాడే నైతిక అర్హత ఉంటుందన్నారు.  ఓట్  చోరీపై గొంతు చించుకుంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణలో తమ పార్టీ చేసిన ఎమ్మెల్యేల చోరీపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  ఓట్ల చోరీ ఒక నేరమైతే, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను దొంగిలించడం అంతకంటే పెద్ద నేరమని, అది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి సిగ్గు,శరం ఉంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అప్పుడే ఆయనకు ఓట్ల చోరీ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.

ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పి, గల్లీలో అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వెన్నతో పెట్టిన విద్య అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతూ ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల దొంగతనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్న రాహుల్ గాంధీకి, తెలంగాణలో ఆయన పార్టీ చేస్తున్న ఎమ్మెల్యేల దొంగతనం కనిపించకపోవడం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలకు , రాహుల్ గాంధీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం అని విమర్శించారు.

బీఆర్ఎస్ సిద్ధాంతాలు కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించి తెలంగాణ ప్రజలు గెలిపించిన  పది మంది ఎమ్మెల్యేలను అధికార మదం, డబ్బును ఎరగా చూపించి  కాంగ్రెస్ లో చేర్చుకోవడం అనైతికం, సిగ్గుమాలిన చర్య కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజా తీర్పును కాలరాసి కాంగ్రెస్ చేసిన సిగ్గుమాలిన చర్య ఓట్లను దొంగిలించడం కంటే ఘోరమైన నేరం అన్నారు. ఓట్ చోరీ గురించి మాట్లాడే ముందు, తెలంగాణలో కాంగ్రెస్ చేసిన ఎమ్మెల్యేల చోరీపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.                  

ప్రజాతీర్పును అపహాస్యం చేసి సంతలో పశువుల్లా తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తీరుపై  భారత్ జోడో న్యాయ్ యాత్ర చేసిన రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. ఫిరాయింపులతో తెలంగాణ ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఎవరి బలం ఏంటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు రాజకీయాలను తెలంగాణ ప్రజలు  అసహ్యించుకుంటున్నారని, సరైన సమయంలో ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ హెచ్చరించారు.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs YS Jagan: పల్నాడు వాటర్ గ్రిడ్, రాయలసీమ లిఫ్ట్ వివాదంతో రచ్చ! - తమ గొప్పతనం కోసం బీఆర్ఎస్ నేతలు జగన్‌ను కించపరుస్తున్నారా?
పల్నాడు వాటర్ గ్రిడ్, రాయలసీమ లిఫ్ట్ వివాదంతో రచ్చ! - తమ గొప్పతనం కోసం బీఆర్ఎస్ నేతలు జగన్‌ను కించపరుస్తున్నారా?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
YS Sharmila vs K Kavitha: ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
YS Sharmila vs K Kavitha: ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget