News
News
X

మీ నిరసన పద్దతి నచ్చింది, రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తాం- మంత్రి కేటీఆర్

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీకేయూకేటీలో నెలకొన్న సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులను మెచ్చుకున్నారు.

FOLLOW US: 

KTR RGUKT Varsity Visit: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీకేయూకేటీలో నెలకొన్న సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఏ రాజకీయ పార్టీకి అవకాశం ఇవ్వకుండా విద్యార్థులు వారంతట వారే ఆందోళన చేయడం నచ్చిందని అన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ జోగురామన్న కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లతో బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు.

త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం

ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఒక భవనం నిర్మించడం తేలిక అని.. అందులో తగిన వసతులు కల్పించడం సవాల్ తో కూడుకున్నదని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులను మెచ్చుకున్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని అన్నారు. త్వరలోనే యూనివర్శిటీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయి వీసీ, బోధకులను నియమించాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ జూన్‌లో ఆర్జీయూకేటీ విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. జూన్‌ 20న మంత్రి సబితా హామీ మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు.

మీ నిరసన పద్ధతి నచ్చింది

News Reels

నవంబర్ లో విద్యార్థులందరికీ ల్యాప్ టాప్ లు ఇస్తామని కేటీఆర్ అన్నారు. 2 నెలల తర్వాత సబితా ఇంద్రారెడ్డిని ఇక్కడకు తీసుకొస్తానని.. అప్పటికల్లా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఆడిటోరియంలో మార్పులు చేయాలని సూచించారు. హాస్టల్ కష్టాలు ఎలా ఉంటాయో తనకూ తెలుసునని కేటీఆర్ అన్నారు. అయితే సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించడానికి సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్రీడల కోసం రూ. 3 కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. డిజిటల్ ల్యాబ్ లు, ఆధునిక తరగతి గదులు వంటి వసతులు కల్పిస్తామని స్పష్టంచేశారు. ఆర్జీకేయూకేటీ విద్యార్థుల సంస్థ అని.. దాన్ని మీరే కాపాడుకోవాలని అన్నారు. క్యాంపస్ శుభ్రంగా ఉంచుకునే బాధ్యత విద్యార్థులదే అని సూచించారు. 

ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం

విద్యార్థుల నుంచి నూతన ఆవిష్కరణలు రావాలని కేటీఆర్ అన్నారు. భారత్ కన్నా ఎన్నో రెట్లు తక్కువ జనాభా ఉన్న అమెరికా నుంచి ఆకర్షించే ఉత్పత్తులు వస్తుంటే.. మన దేశం నుంచి ఇంకెన్ని రావాలని ప్రశ్నించారు. ఉద్యోగాలు చేసే స్థితి నుంచి.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఇన్నోవేషన్ వారోత్సవాలు జరగాలన్నారు. ఉత్పత్తిలో సత్తా ఉంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని మంత్రి అన్నారు. ఐటీ, విద్యాశాఖ సంయుక్తంగా ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

అందరం ఒకేలా కూర్చుందాం

సమావేశంలో ప్రసంగించేందుకు వచ్చిన కేటీఆర్‌కు.. ఆడిటోరియంలో కొంత మంది విద్యార్థులు కుర్చీలపైనా, మరికొంత మంది కింద కూర్చొని కనిపించారు. విద్యార్థులు అలా కూర్చోవడం బాగాలేదని వీసీ, ఇతర అధికారులతో కేటీఆర్ అన్నారు. తాను తిరిగి వచ్చేసరికి ఆ పరిస్థితి మారాలని కోరారు. ‘విద్యార్థులు కింద కూర్చోవడం నాకు నచ్చలేదు. అయితే, అందరం కిందనైనా కూర్చోవాలి.. లేకపోతే పైన కూర్చోవాలి. ఇలా సగం సగం కూర్చోవడం బాగాలేదు’ అని కేటీఆర్ అన్నారు. నవంబర్‌లో మళ్లీ పర్యటనకు వచ్చే సరికి కుర్చీలు ఏర్పాటు చేస్తామని.. దానికయ్యే డబ్బును వెంటనే మంజూరు చేస్తామని కేటీఆర్ చెప్పారు.

Published at : 26 Sep 2022 07:29 PM (IST) Tags: minister ktr latest news KTR Latest News Minister KTR KTR at RGKUKT versity KTR at Basara RGKUKT versity news

సంబంధిత కథనాలు

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Breaking News Live Telugu Updates: జీడిమెట్లలో ఏటీఎం దొంగతనానికి యత్నం, సైరన్ మోగడంతో పరార్!

Breaking News Live Telugu Updates: జీడిమెట్లలో ఏటీఎం దొంగతనానికి యత్నం, సైరన్ మోగడంతో పరార్!

PM Modi on Mann Ki Baat: సిరిసిల్ల కళాకారుడి టాలెంట్‌కు ప్రధాని మోదీ ఫిదా, మన్ కీ బాత్‌లో ప్రశంసలు

PM Modi on Mann Ki Baat: సిరిసిల్ల కళాకారుడి టాలెంట్‌కు ప్రధాని మోదీ ఫిదా, మన్ కీ బాత్‌లో ప్రశంసలు

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Adilabad: ఐటీ, జీఎస్టీ అధికారినంటూ వ్యాపారికి ఫోన్ చేసిన వ్యక్తి - తర్వాత ఏమైందంటే!

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

టాప్ స్టోరీస్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?