అన్వేషించండి

TRS News: జాతీయపార్టీలో తెలంగాణ అధ్యక్షుడు ఎవరు? ఆ ఛాన్స్ కేటీఆర్‌కే దక్కుతుందా?

టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారాక రాష్ట్ర అధ్యక్షుడిగా తనయుడు కేటీఆర్‌ను నియమిస్తారని అంటున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగుతున్నారు. కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఉన్నారు. అయితే, జాతీయ పార్టీగా ఏర్పడితే పరిస్థితి ఏంటి? జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆరే కచ్చితంగా ఉంటారు. మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారాక రాష్ట్ర అధ్యక్షుడిగా తనయుడు కేటీఆర్‌ను నియమిస్తారని అంటున్నారు.

అక్టోబరు 5న ముహూర్తం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనే నిర్ణయం మేరకు ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ పేరును జాతీయ స్థాయిలో ప్రతిబింబించేలా మార్చనున్న సంగతి తెలిసిందే. ఈ పేరు మార్పు ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకి పేరు ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ఆమోదం తెలుపుకున్న అనంతరం, తర్వాతి రోజు అంటే ఈ నెల 6న ఢిల్లీకి టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లనుంది. 

ఈసీకి దరఖాస్తు
టీఆర్ఎస్ పేరును జాతీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తారు. దాన్ని ఆమోదిస్తే వెంటనే ఆ పేరు అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో పార్టీ చేరుతుంది. ఇక కొత్తగా ఏర్పాటైన జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఉంటారు. తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా ప్రస్తుత టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమించే అవకాశం ఉంది. జాతీయ పార్టీగా పేరుకు ఆమోద ముద్ర పడ్డాక, ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. దాని ప్రకారం పార్లమెంటులో, శాసన సభలో, శాసన మండలిలో పార్టీ పేరును కూడా మార్చుతారు. శాసన సభలో పార్టీ పక్ష నేతగా కేసీఆర్‌ కొనసాగే అవకాశం ఉందని సమాచారం. జాతీయ పార్టీ తరఫున తొలుత సమన్వయ కర్తలను నియమించి ఆ తర్వాత కొత్త జాతీయ పార్టీకి రాష్ట్రాల్లో అధ్యక్షులను నియమించే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలతో పాటు సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలను తర్వాత కొనసాగిస్తారని తెలుస్తోంది.

కొత్త పార్టీ ఏర్పాటా? లేక ఉన్న పార్టీ పేరునే మార్చుతారా?
జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో నంబర్ వన్ గా ఉన్న టీఆర్ఎస్ ను అలాగే కొనసాగిస్తారా? లేక జాతీయ పార్టీ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ను అందులో విలీనం చేస్తారా? అదీ కాకుండా టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా మార్చుతారా? అనే అంశంలో స్పష్టత లేదు. రెండు వేర్వేరు పార్టీలు ఉంటే రాష్ట్రంలో గందరగోళం ఏర్పడుతుందని, టీఆర్ఎస్ పేరుతో వెళితే ఇతర రాష్ట్రాల్లో ఆదరణ ఉండదనే అభిప్రాయాలు వచ్చాయి. అందుకని ప్రాంతీయ పార్టీ పేరునే మార్చి దేశవ్యాప్తంగా పోటీ చేయాలనే వ్యూహాన్ని అనుకుంటున్నట్లుగా సమాచారం. కొత్తగా పార్టీ పెడితే కారు గుర్తు ఉండక పోవచ్చు కాబట్టి, పార్టీకే పేరు మార్చడం వల్ల గుర్తు మారే సమస్య తలెత్తదని కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget