అన్వేషించండి

KTR On Elections : కేసీఆర్ 9 ఏళ్ల పాలన ట్రైలరే - 99 సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా !

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 99 సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 9 ఏళ్ల కేసీఆర్ పరిపాలన ట్రైలరేనన్నారు.


KTR On Elections :  తెలంగాణలో మరో ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని మంత్రికే టీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా 99 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. ఈ తొమ్మిదేళ్లలో ప్రజలు చూసింది కేవలం ట్రైలరేనన్నారు. కేసీఆర్ ఆలోచనల్లో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయన్నారు. నానక్ రామ్ గూడలో  క్రెడాయ్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు.  హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని.. ద్వితీయ శ్రేణి నగరాల్లో 50వేల ఐటీ ఉద్యోగాలను సృష్టంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. 

ఈ సందర్భంగా గత ముఖ్యమంత్రులతో పోలిస్తే కేసీఆర్ ఎంత భిన్నంగా పరిపాలించారో విశ్లేషించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు, వైఎస్ఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న తేడా ఏంటో మున్సిపల్ మంత్రి కేటీఆర్ వివరించారు. చంద్రబాబు ఐటీ, బిజినెస్ రంగాలను ముందుకు నడిపించారు. తనను తాను ఒక సీఈవోగా అభివర్ణించుకునే వారన్నారు.   వైఎస్ఆర్ రైతులు, సంక్షేమం, పేదల‌పై దృష్టి పెట్టారు. వారిద్దరూ కేవలం కొన్ని రంగాలనే ఎంచుకొని రాష్ట్రాన్ని పాలించారున్నారు.   కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్దికి చర్యలు తీసుకుంటూనే.. మరో వైపు వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలిపారన్నారు.  రైతులు, ప్రజల సంక్షేమాన్ని కూడా ఆయన మారువలేదని మంత్రి కేటీఆర్  క్రెడాయ్ సభ్యలుకు తెలిపారు. 

అన్ని వర్గాల వారి సంక్షేమానికి కేసీఆర్ పని చేసినందున వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు ఇస్తున్నాము. నీళ్ల బాధ తీరింది. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయిన కేటీఆర్ చెప్పారు. 1940లో కట్టిన అప్పర్ మానేరు కోసం రైతులు హైదరాబాద్ వరకు పాదయాత్రలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎండాకాలంలో కూడా నిండు కుండలా ఉందని చెప్పారు. ఇలాంటి మార్పులు రావాలంటే నాయకుడిలో చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. 67 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలోనే సాధ్యపడిందంటే అందుకు సీఎం కేసీఆర్ దార్శనికతే కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు.
 
హైదరాబాద్ నగరం నాది అని చెప్పుకోవడానికి మనమే కాకుండా, మన పిల్లలు కూడా గర్వ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎన్నో అనుమానాలు, అపోహలు ఏర్పాడ్డాయి. ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్న వాళ్లు చాలా కంగారు పడ్డారు. 10 ఏళ్ల క్రితం ఇందిరా పార్క్ వద్ద పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. పవర్ హాలీడేలు పెడితే మేము ఎలా బతకాలి, మా కార్మికులకు ఎలా ఉపాధి దొరుకుందని ఆవేదన చెందారు. ఒక వైపు రైతుల ధర్నాలు. మోటార్లకు కరెంటు కావాలని.. మరోవైపు నీళ్ల గోస ఉండేది. అప్పట్లో ఊర్లలోకి పోవాలంటే భయమేస్తుండేది. కరెంటు, నీళ్లకు కూడా ఈ ప్రాంతం చాలా ఇబ్బంది పడిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 

సాయిచంద్ మరణంతో కార్యక్రమం రద్దు చేయాలనుకున్నామని.. కానీ  తప్పనిసరి పరిస్థితుల్లో కార్యక్రమానికి హాజరయ్యానని కేటీఆర్ తెలిపారు.  సాయిచంద్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
 

టాప్ హెడ్ లైన్స్

BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Hyderabad Cyber Crime News: హైదరాబాద్‌లో మ్యూల్ ఖాతాల గుట్టు రట్టు! 15 కోట్ల లాభం అని రూ. 1.22 కోట్లు కొట్టేశారు!
హైదరాబాద్‌లో మ్యూల్ ఖాతాల గుట్టు రట్టు! 15 కోట్ల లాభం అని రూ. 1.22 కోట్లు కొట్టేశారు!
Breaking News: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Ram Charan At APL In Vijayawada: అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
Embed widget