అన్వేషించండి

Malkajgiri BRS : బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా శంభీపూర్ రాజు - సుదీర్ఘ నిరీక్షణకు ప్రతిఫలం !

Telangana : మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా శంభీపూర్ రాజు పేరును కేీసఆర్ ఖరారు చేశారు. మల్లారెడ్డి కుమారుడు వెనుకడుగు వేయడంతో శంభీపూర్ రాజుకు అవకాశం దక్కింది.

KCR Finalized Shambhipur Raju  as Malkajigiri MP candidate :  మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోటీ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి తప్పుకోవడంతో శంభీపూర్ రాజుకు అవకాశం ఇస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. శంభీపూర్ రాజు.. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ వెంట ఉన్నారు. గతంలో ఆయన కుత్బుల్లాపూర్ నుంచి  పోటీ చేయాలని అనుకున్నారు. కానీ గత మూడు ఎన్నికల్లోనూ చాన్స్ లభించలేదు. ఈ కారణంగా కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.                            

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిక్కెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించే క్రమంలో కేపీ  వివేకానంద్ కే కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. మొదట అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత పార్టీ గెలుపు కోసం పని చేశారు. అదే సమయంలో మల్కాజిగిరి టిక్కెట్ ఇచ్చినప్పటికీ పార్టీని వీడిన మైనంపల్లి హన్మంతరావు ప్లేస్‌లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆసక్తి చూపడంతో ఆయనకు చాన్సిచ్చారు. ఈ కారణంగా ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా మల్కాజిగిరి ఎంపీ స్థానానికి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ పా ర్టీ నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పోటీ నుంచి విరమించుకున్నారు. ఈ కారణంగా ఎన్నాళ్ల నుంచో చూస్తున్న టిక్కెట్ శంభీపూర్ రాజుకు లభించింది.                                 

అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. అన్ని సెగ్మెంట్లలో కలిపి మూడున్నర లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. విజయం సునాయాసం అనుకున్నప్పటికీ అభ్యర్థులు వెనుకడుగు వేయడంతో శంభీపూర్ రాజుకు చాన్సిచ్చారు.                   

30 లక్షల పైచిలుకు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ సెగ్మెంట్‌పై ప్రధాన పార్టీలు కన్నేశాయి. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. పక్కా వ్యూహంతో బీజేపీ ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా బరిలోకి దిపింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్‌లు వేస్తున్నారు.  కాంగ్రెస్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి బీజేపీ రంగంలోకి దింపింది.  కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని  ఖరారు చేయలేదు.                                                                          

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
Villa Orchids Security Failure: కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
Embed widget