By: ABP Desam | Updated at : 28 Jul 2023 02:45 PM (IST)
Edited By: Pavan
మహిళలకు మాత్రమే ఈ గ్రంథాలయం, తెలంగాణలోనే మొదటి తరహా లైబ్రెరీ - ఎక్కడో తెలుసా? ( Image Source : Freepik )
Viral News: కేవలం మహిళల కోసమే మొదటిసారిగా గ్రంథాలయాన్నీ ప్రారంభించారు. రాష్ట్రంలో ఇలాంటి తరహాలో కేవలం మహిళల కోసమే ఉన్న లైబ్రెరీ ఇదే మొదటిది కావడం విశేషం. కరీంగనర్ జిల్లా రాంనగర్ కేంద్రంగా.. మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన మహిళా గ్రంథాలయం ఇప్పుడు ఓ ప్రగతిశీల అంశంగా మారనుంది. ఇలాంటి తరహా గ్రంథాలయం ఇదొక్కటే కావడం గమనార్హం. తాజాగా ప్రారంభించిన ఈ లైబ్రెరీకి చుట్టు పక్కల నుంచి, కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు గ్రంథాలయ అధికారులు చెబుతున్నారు. ఈ లైబ్రెరీలో మహిళలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. అలాగే మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన వారి పుస్తకాలను ప్రత్యేకంగా ఉంచారు. సావితీభాయి పూలే, సరోజిని దేవి, కల్పనా చావ్లా నుంచి ఇందిరా గాంధీ, మదర్ థెరిస్సా, సూపర్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి వరకు జీవితంలో విజయం సాధించిన వారి పుస్తకాలను ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. వంటలు, కుట్లు, అల్లికలు, గార్డెనింగ్, ఆరోగ్య సూత్రాలు, బ్యూటీషియన్ బుక్స్ వంటివి కూడా ఈ గ్రంథాలయంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. చారిత్రక పుస్తకాలు, నవళ్లు, సాహిత్య పురస్కారాలు అందుకున్న పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి ప్రారంభించిన ఈ తొలి మహిళా గ్రంథాలయానికి స్త్రీల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి తరహా ప్రత్యేక చర్యలు మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, వారి కోసమే కేటాయించిన ఇలాంటి ప్రత్యేక ప్రాంతాల్లో వారు మరింత సౌకర్యవంతంగా ఉంటూ చదువు పై దృష్టి పెడతారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే యువతులకు ఇలాంటి గ్రంథాలయాలు మరింత వెన్నుదన్నుగా నిలుస్తాయని చెబుతున్నారు. ఇతర లైబ్రెరీల్లో పురుషుల డామినేషన్ ఎక్కువగా ఉండి, కనీసం సీట్లు దొరకలేని పరిస్థితి ఉందని.. మహిళల ప్రత్యేక లైబ్రెరీ ఏర్పాటు చేయడం వల్ల వారికి మరిన్ని ఎక్కువ సౌకర్యాలు అందించినట్లు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కరీంనగర్ లోని మహిళా సంఘం భవనంలో నిర్వహిస్తున్న ఈ లైబ్రెరీని.. త్వరలోనే 5 గదులతో.. పూర్తి స్థాయి ఫర్నీచర్ తో కోటి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రతి నెలా వార్తా పత్రికలు, ఇతర మ్యాగజైన్లు కోసం ప్రతి రీడింగ్ రూమ్ కు 2 వేల రూపాయల బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊర్లోనూ అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రెరీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. క్రమంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రంథాలయాన్ని, ఓ మహిళా ఓపెన్ లైబ్రెరీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సెల్ ఫోన్లు, ట్యాబ్ లకు అలవాటు పడిన వారిని క్రమంగా గ్రంథాలయాలకు మళ్లించ గలిగితే గొప్ప మార్పు చోటు చేసుకుంటుందని, రాబోయే తరం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Voter Sahaya Mithra: తెలంగాణ ఓటర్ల కోసం చాట్ బాట్, అందుబాటులోకి తెచ్చిన ఎన్నికల సంఘం
Telangana Elections: 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ బీసీ నేతల నుంచి పెరుగుతున్న డిమాండ్
Breaking News Live Telugu Updates: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా
GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>