అన్వేషించండి

Karimnagar News: ఆర్టీసీలో లగేజ్ మర్చిపోతే ఏమవుతుంది? బస్‌లో దొరికిన కోడిపుంజు కథేంటీ?

Karimnagar RTC News:రద్దీ సమయంలో అసలు ప్రయాణించడమే కష్టమనుకుంటే లగేజ్‌తో వెళ్తే అంతే సంగతులు. ఇలా ప్రయాణించే చాలా మంది రద్దీలో దిగే టైంలో లగేజ్‌ మర్చిపోతుంటారు.

Karimnagar RTC News: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది హడావిడిలో తమ సామానులను మరచిపోతుంటారు. మరి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ మరింత పెరిగిపోయింది. 

ఇలా రద్దీ సమయంలో అసలు ప్రయాణించడమే కష్టమనుకుంటే లగేజ్‌తో వెళ్తే అంతే సంగతులు. ఇలా ప్రయాణించే చాలా మంది రద్దీలో దిగే టైంలో లగేజ్‌ మర్చిపోతుంటారు. హడావిడిలో తమ సామాన్లను బస్సులోనే వదిలేస్తుంటారు. అయితే అలా మర్చిపోయిన సామాన్లు ఆర్టీసీ అధికారులు ఏం చేస్తారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఏం చెబుతున్నారు. దాన్ని తిరిగి పొందవచ్చో కరీంనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం ఏబీపీ దేశంతో మాట్లాడుతూ వివరాలు అందజేశారు. 

సమ్మక్క సారలమ్మ జాతర ప్రయాణాలు

ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సీజన్ మొదలైంది. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇలా వరంగల్ నుంచి వేములవాడకు వెళ్తున్న ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. తనతో పాటు ఒక కోడిపుంజు తెచ్చుకున్నారు. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లిన ఆ బస్సు ప్రయాణికులను అక్కడ దించి తిరిగి కరీంనగర్ డిపోకు చేరుకుంది. 

కోడిపుంజు మర్చిపోయిన వ్యక్తి

డిపోలో బస్సును ఆర్టీసీ సిబ్బంది శుభ్రం చేస్తున్న టైంలో బస్సులో కోడిపుంజును చూశారు. సిబ్బంది వెంటనే డిపో కంట్రోలర్‌కు సమాచారం అందించారు. దీంతో ఆ కోడిపుంజుని భద్రపరించారు. అడిగితే ప్రయాణికులకు అప్పగించేందుకు డిపోలో ఉంచారు. డిపోలో భద్రపరిచి ఉంచిన కోడిపుంజును మూడు రోజుల వరకు ఎదురు చూస్తారు. 

మూడు రోజుల్లో రాకపోతే వేలం

ఎవరైనా వస్తే వారి వివరాలు తీసుకొని దాన్ని ఇచ్చేద్దామనుకున్నారు. ఎవరు రాకపోతే వేలం వేస్తామని డిపో మేనేజర్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో పేలుడు పదార్థాలు, జంతువులను వెంట తీసుకెళ్లడం నేరమని చెబుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో దొరికిన కోడిపుంజును తీసుకురావడం విచిత్రంగా ఉంది. మొత్తానికైతే కోడిపుంజుకు సంబంధించిన యజమాని ఆ కోడిని తీసుకెళ్తారా లేదా అనే విషయం అయితే చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Naxal Mukt Bharat: మావోయిస్టు నీడ వీడి అభివృద్ధి వైపు.. నక్సల్ ముక్త్ భారత్‌లో భద్రాద్రి కొత్తగూడెం ఆదర్శం!
మావోయిస్టు నీడ వీడి అభివృద్ధి వైపు.. నక్సల్ ముక్త్ భారత్‌లో భద్రాద్రి కొత్తగూడెం ఆదర్శం!
Karimnagar Development: రాజకీయాలను పక్కనబెట్టి కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి.. రూ.4 కోట్ల పనులకు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన
రాజకీయాలను పక్కనబెట్టి కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి.. రూ.4 కోట్ల పనులకు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget