అన్వేషించండి

Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?

Job Offers: కేవలం బైక్ నడపడం తెలిస్తే చాలు. విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగాలు సంపాదించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.

TOMCOM Offers Jobs To Unemployed Youth: బైక్ నడపడం తెలిస్తే చాలు విదేశాల్లో వేల రూపాయల్లో జీతం. కేవలం బైక్ నడపడం తెలిస్తేనే అంత జీతం నిజమేనా అనుకుంటున్నారా...? అవును ఇది ముమ్మాటికీ నిజమే. అయితే ఇందుకోసం ఈ జాబ్‌కు ఎలా అప్లై చేసుకోవాలి ఏ కన్సల్టెన్సీలో సంప్రదించాలి అనే డౌట్ రావచ్చు. కానీ ఇది ఏ ప్రైవేట్ సంస్థనో లేక కన్సల్టెన్సీ వారు చేస్తున్నది కాదు ప్రభుత్వ రంగం నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన (TOMCOM) తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ అనే గవర్నమెంట్ అండర్ టేకింగ్ సంస్థతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.

విదేశాల్లో ఉద్యోగాలు

తెలంగాణలో అనేక మంది నిరుద్యోగులు ఇతర దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించాలన్న ఆశతో దళారుల వద్ద మోసపోయి విదేశాల్లో ఇరుక్కుని ఎంతోమంది నరకయాతన అనుభవిస్తున్న ఘటనలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. అయితే, ఇక ఆ దళారులను నమ్మి మోసపోయే అవసరం లేదనే చెప్పుకోవచ్చు. తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ ద్వారా నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. విదేశాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్న నిరుద్యోగులకు కోసం ఇదొక సువర్ణ అవకాశమనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా అనేక మంది నిరుద్యోగులను విదేశాలకు పంపించి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఎంప్లాయిమెంట్ అధికారి శబ్నం తెలిపారు. అందుకోసం కరీంనగర్ కేంద్రంలో కూడా ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూ సేవలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టామ్ కామ్ కల్పించే ఉద్యోగ అవకాశాల్లో ఒకటి హెల్త్ సెంటర్ మరొకటి నాన్ హెల్త్ సెంటర్ ఉద్యోగాలు ఉన్నాయి. హెల్త్ సెక్టార్ అంటే అసిస్టెంట్ డాక్టర్ నర్స్ అసిస్టెంట్ నర్స్ లాంటి ఉద్యోగాలకు అర్హులు నాన్ హెల్త్ సెక్టార్ అంటే ఐటీఐ చేసిన వారు వెల్డర్, ఎలక్ట్రిషన్ చేసిన వాళ్లు, swiggy, Zomatoలో పని చేసిన అనుభవం లేక ఎవరైనా బైక్ రైడింగ్ తెలిసి పదో తరగతి పాస్ కావడంతో పాటు పాస్ పోర్ట్ కలిగిఉండాలని అన్నారు.

అయితే, ప్రస్తుతం అరబ్ కంట్రీలతో పాటు జర్మనీ యూరోపియన్ దేశాలతో పాటు 20 దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అప్లికేషన్ ఫామ్‌తో వచ్చిన వారికి వెంటనే ఆన్లైన్లో ఇంటర్వ్యూ కల్పించి వెంటనే అపాయింట్మెంట్ లెటర్ కూడా అందజేసి సుమారు 20 రోజుల వ్యవధిలోనే విదేశాలకు పంపించి ఉద్యోగం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వీరికి వచ్చే ఉద్యోగంలో నెలకి సుమారు రూ.65 వేల నుంచి రూ.6.50 లక్షల వరకు జీతం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టాంకాం ద్వారా నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ ప్రక్రియ ప్రతి ఒక్క నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఎంప్లాయిమెంట్ అధికారి తిరుపతిరావు, ఎంప్లాయ్మెంట్ అధికారి టామ్ కం మేనేజర్ శబ్నం తెలిపారు.

Also Read: Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం - ర్యాష్ డ్రైవింగ్ చెయ్యొద్దన్నందుకు వృద్ధుడిపై యువకుడు దాడి, చికిత్స పొందుతూ మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Redmi A4 5G: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Redmi A4 5G: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Train Accident: మరో రైలు ప్రమాదం - పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
మరో రైలు ప్రమాదం - పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
AP IAS : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Embed widget