అన్వేషించండి

Siricilla Crime News: యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉరివేసుకున్న పదకొండేళ్ల బాలుడు 

Siricilla Crime News: యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ ఓ పదకొండేళ్ల బాలుడు ఉరివేసుకొని చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Siricilla Crime News: రోజూలాగే ఫోన్ పట్టుకొని ఓ బాలుడు వీడియోలు చూశాడు. రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లాడు. యూట్యూబ్ లో చూస్తూనే ఉరి ఎలా వేసుకోవాలో తెలుసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే బాలుడు ఎంతకీ తలుపులు తీయకపోవడంతో.. తలుపులు పగులగొట్టి తల్లిదండ్రులు ఆ దృశ్యాలను చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఏమైందో గ్రహించేందుకు చాలా సమయం పట్టింది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తీలుకెళ్లగా.. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు చెప్పారు. 

అసలేం జరిరిగిందంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 11 ఏళ్ల ఉదయ్ కుమార్ అనే బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే బాలుడికి తల్లిదండ్రుల సెల్ ఫోన్ లో వీడియోలు చూసే అలవాటు ఉంది. రోజూలాగే శనివారం రోజు రాత్రిపూట భోజనం చేశాడు. అనంతరం ఫోన్ తీసుకొని ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. విషయం గుర్తించని తల్లిదండ్రులు భోజనం చేసి ఇతర పనులు చేసుకున్నారు. బాలుడు చాలా సేపు అవుతున్నా బయటకు రాకపోవడంతో.. తల్లిదండ్రులు చాలా సేపు పిలిచారు. అయినప్పటికీ చడీచప్పుడు లేకపోవడంతో తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఉదయ్ ఉరి వేసుకొని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. అది చూసిన తల్లిదండ్రులకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా కేకలు వేస్తూ ఏడ్వడంతో స్థానికులంతా వచ్చారు. తలుపులు పగులగొట్టి బాలుడిని నేరుగా ఆస్పత్రికి తరలించారు.

మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అలాగే స్థానికులు పోలీసులకు కూడా సమాచారం అందించగా.. హుటాహుటాన రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నిమిత్తం ఉదయ్ మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలే భర్త ఇంట్లో తినట్లేదని భార్య ఆత్మహత్య

బంజారాహిల్స్ ఏరియాలో జరిగిన సూసైడ్ మరీ విచిత్రంగా ఉంది. భర్త ఇంట్లో భోజనం చేయడం లేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ గౌరీ శంకర్‌ నగర్‌లో జరిగిందీ ఘటన. ఈ ప్రాంతంలో ఉండే సంగీత, సంజీవ్‌ మధ్య నాలుగు రోజుల క్రితం చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి భర్త కోపంతో ఉన్నాడు. ఆమె వండి పెట్టింది తినడం మానేశాడు. ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదు. 

భర్త అలా నాలుగు రోజుల నుంచి తిండీ తిప్పలు లేకుండా తనతో మాట్లాడకుండా ఉండటంతో భార్య సంగీత భరించలేకపోయింది. ఎంత బతిమాలినా దారికిరావడం లేదని మానసికంగా తీవ్ర కలత చెందింది. అంతే ఎవరూ లేని సమయంలో ప్రాణం తీసుకుంది. ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి ప్రాణం తీసుకోవడం ఏంటని బోరున విలపిస్తున్నారు. 

మానసిక స్థితి సరిగా లేక యువకుడు సూసైడ్

హైదరాబాద్‌లోనే మరో ప్రాంతంలో ఓ వైద్య విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సికింద్రాబాద్‌-జగద్దిగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దీక్షిత్ రెడ్డి అనే కుర్రాడు తన పురుషాంగాన్ని కోసుకొని సూసైడ్ చేసుకున్నాడు. 21 ఏళ్ల ఆ కుర్రాడు గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. 

ఆ కుర్రాడి మానసిక పరిస్థితి బాగాలేకనే సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పల్ గ్రామానికి చెందిన సోమిరెడ్డి, కరుణ దంపతుల కుమారుడు. చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దీక్షిత్‌రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని... చాలా ఏళ్ల నుంచి మందులు వాడుతున్నట్టు పోలీసులు తెలిపారు. రెగ్యులర్‌గా వేసుకోవాల్సిన మందులను కొన్ని రోజుల నుంచి వేసుకోవడం లేదని... చివరకు ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఇంట్లోవాళ్లు తిరిగి వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు దీక్షిత్ రెడ్డి. డాక్టర్‌ అయి సేవ చేస్తాడుకుంటే ఇలా అర్థాంతరంగా  ప్రాణాలు తీసుకున్న బిడ్డను చూసి ఫ్యామిలీ గుండెలవిసేలా ఏడుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
Embed widget