News
News
వీడియోలు ఆటలు
X

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: రాజన్ని సరిసిల్లలో ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. 

FOLLOW US: 
Share:

KTR Convoy: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఏబీవీపీ కార్యకర్తలు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. సంజీవయ్య నగర్ లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కి ఎదురుగా వెళ్లారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటిఆర్ ను అడ్డుకోవడంతో ఒక్కసారిగా సిరిసిల్లలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఏబీవీపీ నాయకులను ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే పలువురిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన

మరోవైపు ఇదే జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా పలువురు నిరసన వ్యక్తం చేశారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ నోటికి నల్లగుడ్డ కట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న దళితులను మాత్రం మరిచిపోయిందని వాపోయారు.

దళిత బంధు పేరిట ఓట్లు దండుకోవాలని పథకాన్ని ప్రవేశ పెట్టి తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో కొద్ది మందికి మాత్రమే సాయం అందజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట దళితులు బీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదాని అని ప్రశ్నించారు. ఓట్లు వేస్తేనే కదా కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మండలంలోని పదిర గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు కింద ఎంపిక చేసి ఆ ఊరిలో మాత్రమే దళితబంధు అమలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు చెన్ని బాబు, వార్డు సభ్యులు ఎర్పుల శ్రీనివాస్, అందె వీరయ్య, బక్కి రవి, బద్ది దేవరాజు, మస్కురి దేవయ్య, ఏర్పుల తిరుపతి, బక్కి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

రైస్ మిల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్ కుమార్, లింగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైస్ మిల్లును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముగ్గురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం కేటాయించగా.. మొత్తం 30 లక్షల రూపాయలతో పాటు బ్యాంకు రుణాలతో పాటు ప్రభుత్వ పారిశ్రామిక రాయితీలు పొంది రైస్ మిల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లి రైస్ మిల్ ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పలువురు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు కూడా దళితబంధు అందజేయాలని కొందరు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత తీసుకుంటూ పదవికి రాజీనామా చేయాలని మంరి కొంత మంది కోరుతున్నారు. 

Published at : 27 Mar 2023 04:13 PM (IST) Tags: KTR Minister KTR Telangana News Karimnagar News ABVP Activists Protest Minister KTR Convoy Stopped

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!