News
News
వీడియోలు ఆటలు
X

Bandi Sanjay: హిందుత్వం లేకుంటే దేశం పాకిస్తాన్ అయ్యేది, వాళ్లను రోడ్ల మీద ఉరికిస్తాం!- బండి సంజయ్

హిందుత్వం లేకుంటే దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఝనిస్తాన్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.

FOLLOW US: 
Share:

Bandi Sanjay sensational comments at Hindu Ekta Yatra: రజాకార్ల రాజ్యాన్ని పాతరేసి రామరాజ్యాన్ని స్థాపించేందుకే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణ అంతటా హిందుత్వ వాతావరణాన్ని తీసుకొస్తానని చెప్పారు. హిందుత్వం లేకుంటే దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఝనిస్తాన్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవన్నారు. కర్ణాటకలో హిందుత్వాన్ని కాపాడే పార్టీ అధికారం కోల్పోవడంవల్లే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడ నినాదాలు చేసే దుస్థితి నెలకొందన్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో కలిసి హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు వేలాదిగా జనం తరలివచ్చారు. హిందుత్వ సైనికులతో కరీంనగర్ యావత్తు కాషాయ సంద్రమైంది. 

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యంశాలు...
-  హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనడానికి వచ్చిన హిందూ టైగర్ అసోం సీఎం హిమంత బిశ్వశర్మకు ధన్యవాదాలు..
-  హిందుగాళ్లు బొందుగాళ్లన్న వాళ్లను బొందపెట్టిన గడ్డ. హిందుత్వ అడ్డా  కరీంనగర్ గడ్డ.
-  కరీంనగర్ గడ్డకు రుణపడి ఉంటా. హిందు సమాజానికి హాని చేసే వాళ్ల కోసం జైలుకెళ్లిన. మీరంతా ఆశీర్వదించండి... తెలంగాణ మొత్తం హిందుత్వ వాతావరణం తీసుకురావాలే. కుహానా లౌకిక వాదుల ఆటకట్టించడానికే ఏక్తా యాత్ర. మన ఐక్యతను చాటాలనే ఉద్దేశంతోనే సాగుతున్న యాత్ర.
-  కర్ణాటక ఎన్నికలైనయ్. హిందుత్వం మాట్లాడొద్దని అంటున్నాయి. హిందుత్వం మాట్లాడితే అధికారంలోకి రాదని అంటున్నారు.. ఇది వాస్తవమా? అట్లాంటోళ్లంతా ఇఫ్పుడు ఈ గడ్డమీదకొచ్చిన హిందూ ధర్మ రక్షకుల సందోహాన్ని చూడండి. 
-  ఎవడైతే 15 నిమిషాలు టైమిస్తే మనల్ని చంపుతానని అన్నడో... అట్లాంటోళ్లను రోడ్లమీద ఉరికించడానికి ఇంకా 5 నెలలే ఉంది.
-  కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే... పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు.. ఇయాళ హిందూ ధర్మం కోసం ఆలోచించే పార్టీ లేకపోవడంవల్లే పాకిస్తాన్ జిందాబాద్ అనే దుస్థితి వచ్చింది.
-  ఒక్క రాష్ట్రంలో బీజేపీ గెలవకపోతే ఏమైతది? 15పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడొచ్చినవాళ్లంతా 5 నెలల టైమివ్వండి...

 ఈ దేశంలో హిందుత్వం లేకపోతే ఈ దేశం ముక్కలయ్యేది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఝనిస్తాన్ అయ్యేది... ఒక్కసారి ఆలోచించండి. హిందుత్వం లేకుండా భారత్ లేదు... 
-  నిన్నగాక మొన్న ఎంఐఎం నేతలకు సంబంధించిన మెడికల్ కాలేజీలో టెర్రరిస్టును హెచ్ఓడిగా నియమించుకున్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించండి... అట్లాంటి వాళ్లకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
-  80 శాతం జనాభా ఉన్న హిందువుల వాటా సచివాలయంలో రెండున్నర గుంటలా? సచివాలయం మాదే.. నల్ల పోచమ్మ గుడిని స్వర్ణ దేవాలయంగా మార్చే అవకాశం మాకివ్వండి... 
-  సీఎం గద్దెనెక్కిన తరువాత నిజాం సమాధి వద్దకు పోయి మోకరిల్లిండు. నిజాం మనవడు ఇస్తాంబుల్ లో చనిపోతే ఇక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారో... అట్లాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలి.
-  ఒకనాడు హిందువుంటే దేశ బంధు.. ఇయాళ హిందువుంటే అన్నీ బంద్ పెడుతున్నరు. హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. 

-  నిన్నగాక మొన్న జగిత్యాలలో ఎస్ఐ భార్య ఆర్టీసీ బస్సులో చిన్న పసిపాపకు పాలిస్తానంటే బుర్ఖ వేసుకున్న మహిళ ఎంతగా అవమానించిందో... ఎస్ఐను సస్పెండ్ చేసిన సంగతిని మర్చిపోదామా? నిరసనగా స్వచ్ఛంద బంద్ పాటించిన జగిత్యాల ప్రజలకు హ్యాట్సాఫ్...
-  ఎంఐఎం నాయకులు యాడ ఉన్నరు? ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలకు మోదీ మంచి నిర్ణయం తీసుకుంటే ఎందుకు స్పందించరు.
-  తెలంగాణలో రజకార్ల, బకాసురుల రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేస్తాం.
-  లవ్ జిహాద్ గురించి చెబితే బీజేపోళ్లకు, భజరంగ్ దళ్ వాళ్లకు ఏం పనిలేదని విమర్శించారు. ఇయాళ కేరళలో హిందువులపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో... లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి ఎట్లా నరక కూపంలోకి నెడుతున్నారో అద్దం పట్టేలా కేరళ స్టోరీ తీశారు. వాళ్లకు హ్యాట్సాఫ్..

-  బాలగంగాధర్ తిలక్ హిందువులను సంఘటితం చేసేందుకు వినాయక ఉత్సవాలను ఎట్లా నిర్వహించారో... ఆ స్పూర్తితో తెలంగాణలో హిందువులందరినీ సంఘటితం చేసి రామరాజ్యం స్థాపించేందుకు ఈ యాత్ర చేపట్టినం...
-  భాగ్యలక్ష్మీ వద్ద జరిగిన పాదయాత్ర ఎంతటి సంచలనం స్రుష్టించిందో.... ఈరోజు కరీంనగర్ లో జరిగిన హిందూ ఏక్తా యాత్ర అంతటి సంచలనం స్రుష్టించిందనడానికి ఇక్కడికి వచ్చిన విశేష జనమే ఉదాహరణ.
-  భజరంగ్ దళ్ ను నిషేధిస్తే వీపంతా సాఫ్ చేస్తాం... ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి ఇండ్లల్లో టైంపాస్ పాలిటిక్స్ చేయొద్దు. కుహానా శక్తుల చెవుల్లో రక్తం కారేలా హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తాం అన్నారు బండి సంజయ్

Published at : 14 May 2023 08:23 PM (IST) Tags: BJP Bandi Sanjay Hindu Ekta Yatra Karimnagar

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!