Jagitial News: కొండగట్టు దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్, నలుగురి కోసం గాలింపు
Jagitial News: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన దొంగతనం కేసులో ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశామని, మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Jagitial News: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ సెంటర్ లో జిల్లా ఎస్పీ భాస్కర్ ప్రెస్ మీట్ పెట్టి కొండగట్టు దొంగతనం కేసు వివరాల గురించి వెల్లడించారు. కొండగట్టు దొంగతనం కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కొండగట్టు ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను 24 గంటల్లోనే గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులు ఉన్నట్లు స్పష్టం చేశారు. నిందితుల నుండి అంజన్న వెండి విగ్రహం, 5 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. మిగితా 10 కిలోల వెండి ఆభరణాలు, దొంగతనంలో పాల్గొన్న మిగితా నలుగురి కోసం 4 బృందలతో పోలీసులతో గాలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కి చెందిన వారిగా గుర్తించారు.
అసలేం జరిగిందంటే..?
గతనెల 25వ తేదీన జగిత్యాల జిల్లాలోని కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దాదాపు 15 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు కాషాయ కండువాలు, మంకీటోపీలు ధరించి ఆలయం వెనుక వైపు గేటు తాళం పగులగొట్టి ప్రధాన ద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ప్రాంగంణంలో వందలాది మంది భక్తులు నిద్రిస్తున్నా వారి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఆలయ ద్వారానికి అమర్చిన వెండి తాపడం, రేకులను మూల విరాట్టు పైన ఏర్పాటు చేసిన మరర తోరణం, స్వామివారి వక్ష స్థలం పై ఉన్న రామరక్ష విగ్రహహం, ఛత్రి, కిరీటం, అర్ధమంటపంలో గోడలకు అమర్చిిన స్వామి వారి వెండి కవచాన్ని తొలగించి తీసుకెళ్లారు. అలాగే గర్భగుడిలోని రెండు పక్క పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మరో రెండు తలుపులు తెరిచి ఉన్నాయంటూ అర్చకులకు తెలియజేయడంతో వారు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు.