అన్వేషించండి

Bandi Sanjay Prajahita Yatra : హుస్నాబాద్‌లో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత - కాంగ్రెస్ , బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ !

Prajahita Yatra : హుస్నాబాద్ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంపై బండి సంజయ్ మండిపడ్డారు.

Tension in Bandi Sanjay Prajahita Yatra :  తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కరీంగర్ ఎంపీ చేపట్టిన  ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తలకు దారి తీసింది.  ప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.  కర్రలు పట్టుకుని ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  కాంగ్రెస్ కార్యకర్తలల తీరుపై కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి.  కాంగ్రెస్ నాయకులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా పోలీసులు నిలువరించారు.  కాంగ్రెస్ నేతలు కర్రలతో వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.   హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు  పెట్టారు.  హుస్నాబాద్ నుంచి గత ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన  బొమ్మ శ్రీరాం చక్రవర్తిని ప్రజాహిత యాత్ర క్యాంపుకు వెళ్లకుండా పోలీసులు నిలువరిచారు.  ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే  ఊరుకునేది లేదని బంి సంజయ్ హెచ్చరించారు.  

ప్రజాహిత యాత్రకు అడ్డంకులుపై బండి సంజయ్ ఆగ్రహం

ప్రజాహిత యాత్రకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అరాచకాలు స్రుష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు. ‘‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి  ఏం చేశానో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లోకి వెళుతున్నా. కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో, మోదీ ఏం చేశారో చెబుతున్నా... రాముడు అయోధ్యలో పుట్టారనడానికి ఆధారాలేమిటని కించపర్చే వారిని ప్రశ్నిస్తూ జనంలోకి వెళుతున్నా. మీకు దమ్ముంటే.. ఇదే మీ విధానాలతో, మీ నినాదాలతో ఎన్నికల్లోకి వెళ్లండి. కరీంనగర్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా. కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోతే.. నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి’’ అంటూ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. 

ఆరు గ్యారంటీలు అమలుచేయడం చేతకాక యాత్రకు అడ్డంకులు

6 గ్యారంటీలను అమలు చేయడం చేతగాక ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ మూకలను పంపి విధ్వంసం స్రుష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని పొన్నం ప్రభాకర్ ను హెచ్చరించారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారని... ఇప్పుడు కూడా ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతూ అరాచకాలు స్రుష్టిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చూస్తున్నారని మండిపడ్డారు. రేవంతన్నా... పొన్నం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మలిదశ ప్రజాహిత్ర 2వ రోజు బొమ్మెనపల్లిలో ప్రారంభమై రాములపల్లెలోకి ప్రవేశించింది.  

కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా  

నేనేమన్నా... రాముడు అయోధ్యలో పుట్టారనడానికి ఆధారాలేందని అడిగే వాళ్లను అడిగిన.... రాముడు అయోధ్యలోనే పుట్టారని చరిత్ర చెబుతోంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ఆధారాల్లేందని వితండ వాదం చేస్తున్న వాళ్లను నేనడుగుతున్న... మీరు మీ అమ్మకే పుట్టారనడానికి ఆధారాలేంది? అట్లాగే నేను కూడా మా అమ్మకే పుట్టాననడానికి ఆధారాలేంది? అక్కడున్న నర్స్, డాక్టర్లు చెబితేనే కదా తెలిసేది...? నేను నిన్న కూడా అదే చెప్పిన.. అందులో తప్పేముంది? బరాబర్ మళ్లీ అంటా... అయినా మీరు మా రాముడిని కించపరిస్తే మేం ఎందుకు భరించాలి? ఎవరైతే రాముడి జన్మస్థలాన్ని, పుట్టుకను ప్రశ్నించే వాళ్లను చెప్పుతో కొట్టండి... అంతే తప్ప మమ్ముల్ని డిస్ట్రబ్ చేయాలనుకుంటే ఎట్లా? రాముడిని కించపర్చినందుకు, అయోధ్య అక్షింతలను కించపర్చినందుకు మిమ్ముల్ని జనం ఛీత్కరించుకుంటున్నారు... అయినా మీరు మారకపోతే మీకు తగిన బుద్ది చెబుతారు..
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Embed widget