By: ABP Desam | Updated at : 17 Dec 2022 07:20 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మందమల్లి మండలం గుడిపల్లి వెంకటాపూర్‌లో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మాను శివయ్య అనే వ్యక్తి ఇంట్లో ఈ దుర్ఘటన జరిగింది. అర్థరాత్రి అందరూ గాడ నిద్రలో ఉన్న టైంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె పుట్టిన ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మంటలు ఎగసిపడుతున్న విషయాన్ని చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వాళ్లు వెంటనే వచ్చి మంటలు ఆర్పి ఇంట్లోకి ప్రవేశించారు.. చూస్తే నిదట్లోనే ఐదుగురు చనిపోయి ఉన్నారు.
జగిత్యాలలో అగ్ని ప్రమాదం
జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలోని వెంకటేశ్వర్ అయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయపడి పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల నష్టం ఏర్పడి ఉంటుందని యజమానికి అంటున్నారు. షార్టు సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మిల్లులో 7 గ్యాస్ సిలిండర్లు ఉండేవి. ఈ కారణంగానే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు భావిస్తున్నారు.
Kondagattu Temple: కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు - థాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే
బీజేపీ కార్నర్ మీటింగ్స్- రేవంత్ పాదయాత్ర- నేటి తెలంగాణ అప్డేట్స్ ఇవే
Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్
TSRTC Bus Accident : ఛాతీలో నొప్పి బస్సులోంచి దూకేసిన డ్రైవర్, ఆర్టీసీ బస్సు బోల్తా
Funds for Irrigation: స్వర్ణయుగంగా సాగురంగం, నీటిపారుదలకు రూ.26,885 కోట్లు: హరీశ్ రావు
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్