అన్వేషించండి

MLA Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. మినీ మేడారం జాతరలో అసలు వివాదం ఏంటి

కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మినీ మేడారం జాతర సందర్భంగా కౌశిక్ రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు.

హుజూరాబాద్: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌ని మతం పేరుతో దూషించిన వ్యవహారంలో ఆయనపై 126 (2), 132, 196, 299 బిఎన్ఎస్ (BNS) సెక్షన్‌లతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీణవంకలోని మినీ మేడారం జాతరలో గురువారం నాడు పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకుని, మొక్కులు సమర్పించకుండా అదుపులోకి తీసుకుంటున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన కుటుంబంతో కలిసి రోడ్డుపై కూర్చుని నిరసన తెలపడం తెలిసిందే. జాతరలో పాల్గొనకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ వివాదంలోనే కౌశిక్ రెడ్డి కేసులో ఇరుక్కున్నారు.

అసలు విషయం ఇదీ..

కరీంనగర్ జిల్లా వీణవంకలో స్థానికంగా సమ్మక్క జాతర వేడుక నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబసమేతంగా భారీ కాన్వాయ్‌తో బయలుదేరగా, మార్గమధ్యంలో పోలీసులు ఆయనను అడ్డుకుని వారించారు. మినీ మేడారం జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు పాటించి, పరిమిత వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు సూచించడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి దిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తమను అడ్డుకోవద్దని, ఇలాగే వెళ్తాం అనుమతించాలంటూ పోలీసులను పట్టుపట్టారు. ఆ క్రమంలోనే అక్కడ డ్యూటీలో ఉన్న కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతపరమైన వ్యాఖ్యలు చేశారు.

తనను అడ్డుకుంటే మీ సంగతి చెబుతానంటూ కౌశిక్ రెడ్డి పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గం, ఇటు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు 4 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో, కౌశిక్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి వీణవంకకు చేరుకున్నారు.

మినీ మేడారంలో కౌశిక్ రెడ్డి హంగామా..

వీణవంకలో జరుగుతున్న మినీ మేడారం జాతరలో దళిత మహిళా సర్పంచ్ చేత కొబ్బరికాయ కొట్టించాలంటూ కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు వారించినా వినకుండా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ కౌశిక్ రెడ్డి కాసేపు అక్కడ హంగామా చేశారు. తమ సూచనలు బేఖాతరు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బలవంతంగా సమ్మక్క, సారక్క గద్దెల ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లారు. మరోవైపు, వీణవంకలో సమ్మక్క జాతర ట్రస్టీ ఉదయానందరెడ్డి వర్గానికి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్గానికి మధ్య విభేదాలు ఉన్నాయని.. అక్కడ గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు కౌశిక్ రెడ్డిని మొక్కులు చెల్లించుకుని వెళ్లిపోవాలని సూచించారు. కానీ తాను చెప్పినట్లు జరగాలంటూ పట్టుబట్టడంతో పోలీసులు ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబసభ్యులను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లి వాహనాల్లో తరలించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget