News
News
వీడియోలు ఆటలు
X

Bandi Sanjay: కరీంనగర్ జైలు గోదావరి బ్యారక్‌లో బండి సంజయ్, ఖైదీ నెంబర్ ఏంటంటే

బండి సంజయ్ అభ్యర్థన మేరకు బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. ఆ జైలులోని గోదావరి బ్యారక్‌లో ఖైదీగా బండి సంజయ్‌ను ఉంచారు.

FOLLOW US: 
Share:

తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్టు అయిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను కరీంనగర్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. హన్మకొండ జిల్లా ప్రధాన కోర్టు మేజిస్ట్రేట్ బండి సంజయ్‌కి 14 రోజులు రిమాండ్ విధించారు. బండి సంజయ్ అభ్యర్థన మేరకు బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. ఆ జైలులోని గోదావరి బ్యారక్‌లో ఖైదీగా బండి సంజయ్‌ను ఉంచారు. ఖైదీ నంబర్ 7917ను బండి సంజయ్ కి జైలు అధికారులు కేటాయించారు. బండి సంజయ్ జైలుకు వచ్చిన తర్వాత ఆయన్ను కలవడానికి కుటుంబ సభ్యులకు సైతం అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ లేదని జైలర్ నిరాకరించారు. దీంతో ఇవాళ బండి సంజయ్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. పర్మిషన్ వచ్చాక బండి సంజయ్‌ను కుటుంబ సభ్యులు కలుస్తారు. 

బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో కరీంనగర్ జైలు వద్దకు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏ - 1 గా చేర్చిన బండి సంజయ్

అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని, ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారని అందులో కుట్ర ఉందని ఎలా అంటారని.. ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది. బండి సంజయ్ కు జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను కరీంనగర్ జైలుకు తరలిస్తున్నారు. కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. 

టెన్త్ పేపర్ లీక్  కేసు రిమాండ్ రిపోర్టులో  బండి సంజ‌య్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మ‌హేశ్‌, ఏ4గా మైన‌ర్ బాలుడు, ఏ5గా మోతం శివ‌గ‌ణేశ్‌, ఏ6గా పోగు సురేశ్‌, ఏ7గా పోగు శ‌శాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోత‌బోయిన వ‌సంత్ పేర్లను  చేర్చారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్  పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్  చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు.

బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు సీపీ.  బండి సంజయ్, ప్రశాంత్ మధ్య  పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ  తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందన్నారు. బండి సంజయ్‌ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు  సీపీ రంగనాథ్‌ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

నిందితుడు బూర ప్రశాంత్ గతంలో జర్నలిస్టుగా పనిచేశాడని, ప్రస్తుతం అతనికి ఏ మీడియా సంస్థతో సంబంధం లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్  పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్  చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు.

Published at : 06 Apr 2023 08:59 AM (IST) Tags: Bandi Sanjay Bandi sanjay latest news Karimnagar SSC Paper Leak Hindi Paper Leak Khaidi number

సంబంధిత కథనాలు

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్