అన్వేషించండి

Karimnagar News : ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్, బిల్లులు చెల్లించడంలేదని ఆరోపణ

Karimnagar News : ప్రభుత్వ పాఠశాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదని ఓ కాంట్రాక్టర్ స్కూల్ కు తాళం వేశాడు. అప్పు చేసి పనులు చేశారని, వడ్డీలు చెల్లించలేకపోతున్నానని కాంట్రాక్టర్ అంటున్నారు.

Karimnagar News : మన ఊరు-మన బడి పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేశాడు. కరీంనగర్ జిల్లాలో మరో కాంట్రాక్టర్ తన ప్రతాపం చూపించాడు. బిల్లులు కట్టడం లేదంటూ ఒక రోజు కిందటే కొత్తపల్లిలో ఒక కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేయగా అదే విధంగా మరో కాంట్రాక్టర్ తాళం వేసి తన నిరసన తెలిపాడు.  వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ తదితర పనుల కోసం రూ.ఐదు లక్షలకు పైగా టెండర్ ను సురేందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ దక్కించుకొన్నాడు. జూన్ నెలలో కొంత వరకు పనులు పూర్తి చేశాడు. అయితే ఇప్పటి వరకు పైసా చెల్లించలేదని, దాదాపుగా మూడు లక్షల అప్పు తెచ్చి పనులు పూర్తి చేశారని, ఇప్పటి వరకూ పైసా చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నాడు. ఇబ్బందులు పడుతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేరుగా స్కూల్ కి వచ్చి తాళం వేయడంతో విద్యార్థులు పాఠశాల సిబ్బంది కంగుతిన్నారు. అయితే మొదట ఇదే పని చేసినా కొత్తపల్లి కాంట్రాక్టర్ పై పోలీసు కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు పాఠశాల సిబ్బంది. తాము ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇలా చేయడం తప్ప వేరే దారి లేదంటూ కాంట్రాక్టర్లు తిరుగుబాటు చేస్తున్నారు. పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. 

మరో ఘటన 

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా  మన ఊరు -మన బడి పథకం చేపట్టింది. ఈ పథకం కింద అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదని ఓ కాంట్రాక్టర్ తాళం వేశారు. ఈ ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్, కాంట్రాక్టర్ శ్రీకాంత్ కు ప్రభుత్వం నుంచి రూ.4.4 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ క్లాస్ రూమ్‌లకు తాళం వేశారు. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులంతా తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంజినీరింగ్ అధికారులు చెప్పిన ప్రకారం పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. తాను అప్పు చేసి పనులు పూర్తి చేశానని, వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నానని కాంట్రాక్టర్ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లించాలని ఎన్ని సార్లు కోరినా ఫలితంలేకనే క్లాస్ రూమ్ లకు తాళం వేశానని చెప్పారు. తనకు రావాల్సిన రూ.4.4 లక్షల బిల్లులు మంజూరు చేసేంత వరకు తాళం తీసేది లేదని శ్రీకాంత్ తేల్చిచెప్పారు. 

Also Read : Karimnagar Schools : కరీంనగర్ ప్రభుత్వ బడుల్లో జ్వరాల టెన్షన్, అప్రమత్తమైన వైద్యశాఖ

Also Read : Nizamabad News: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో మూడు ముక్కలాట- నలిగిపోతున్న కేడర్

 

టాప్ హెడ్ లైన్స్

Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Balakrishna Health Bulletin: నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
Embed widget