అన్వేషించండి

Kalvakuntla Kavitha Leader: తెలంగాణకు కొత్త నాయకత్వం అవసరం - జాగృతి మరింత విస్తృత పరుస్తాం - కవిత కీలక వ్యాఖ్యలు

Telangana Jagruti: తెలంగాణకు కొత్త నాయకత్వం అవసరం అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. లీడర్లను తయారు చేసేందుకు జాగృతి లీడర్ శిక్షణా తరగతులని ప్రారంభించారు.

Telangana needs new leadership : తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.  తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ  కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు.

కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా కొత్తగా, నవీనంగా ఉంటేనే సంస్థలు బ్రతుకుతాయని వివరించారు. లీడర్ అంటే కేవలం సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం మాత్రమే కాదని, ఈ సమాజంలో తొలి లీడర్ ఇంట్లో ఇళ్లాలని తెలిపారు. “లీడర్ అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరు. తల్లి గర్భంలో నుంచి ఎవరూ కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడు అవుతాడు తప్పా మూస పద్దతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు.” అని వ్యాఖ్యానించారు.
 
తోటివారి గోప్యతను, మర్యాదను కాపాడకుండా ఏది పడితే అది మాట్లాడడం ట్రెండ్ గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు యూట్యూబర్ల అండ కూడా బాగా ఉందని, ఎవరెక్కువ తిడితే వారికి అన్ని వ్యూవ్స్ ఎక్కువ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి నాయకులు తిట్టకుండా పదునైన విమర్శ చేయడం నేర్చుకోండని సూచించారు. తిట్లకు దిగజారామంటే విషయం లేదని అర్థమని, పక్కోడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యే, ఎంపీగా లేరు.. కానీ ఇవాళటికీ అందరం గాంధీని గుర్తు చేసుకుంటామని చెప్పారు. “తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరికి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంది. శతృవు ఒక చెంపపై కొడితే మరో చెంపు చూపించమని గాంధీ అంటారు. కానీ మనం శతృవు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి. మన ఆలోచనే ఆయుధం కావాలి.” అని వ్యాఖ్యానించారు. సామాజిక స్పృహ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 11వ స్థానంలో ఉందని ఒక సర్వేలో తేలిందని ప్రస్తావించారు.
  
సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతి కూడా మనుగడ సాధించలేదని, సాంస్కృతిక నేపథ్యం లేని జాతి పునాది లేకుండా కట్టిన బిల్డింగ్ లాంటిదని వివరించారు. తెలంగాణ జాతికి అద్భుతమైన సాంస్కృతిక నేపథ్యం ఉందని తెలిపిన ఎమ్మెల్సీ కవిత.. దాన్ని పరిరక్షించడమే మన ఆలోచనగా తెలంగాణ జాగృతి పని చేస్తూ వచ్చిందని స్పష్టం చేశారు. గత 19 ఏళ్లలో మన భాష, యాస, కట్టు, బొట్టు, బతుకమ్మ, బోనం వంటి వాటి గురించి కొట్లాడిందని, తెలంగాణ ఉద్యమకాలంలో యాసను అవహేళన చేసిన ఒక వ్యక్తికి నంది అవార్డును ఇవ్వాన్ని నిరసించిన ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి అని, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఆంధ్రా సినిమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి అని వివరించారు. నమ్మిన సిద్దాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా సరై, ఎంత పెద్ద మాద్యమమైనా ఎదురొడ్డి నిలిచిన సంస్థ తెలంగాణ జాగృతి అని తేల్చిచెప్పారు. తెలంగాణ రాకముందు రాష్ట్రం కోసం కొట్లాడాము... వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి కోసం పనిచేశామని, యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలంగాణకు నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోబోదని, తెలంగాణకు నష్టం చేసే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ జాగృతి ఆపి తీరుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. 

 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget