అన్వేషించండి

KTR Vs Kavitha: కేటీఆర్ తల్లిదండ్రుల సెంటిమెంట్ - కవిత నిరాదరణ ఆవేదన - ఎవరిది నిజం?

Kalvakuntla Family: కవిత తల్లిదండ్రుల్ని బాధపెడుతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కవిత తన స్వార్థం కోసమే బీఆర్ఎస్ కు నష్టం చేస్తున్నారా?

Kalvakuntla Family politics: తెలంగాణ రాజకీయాల్లో పవర్ ఫుల్ కల్వకుంట్ల ఫ్యామిలీ. అయితే ఇటీవలి కాలంలో ఆ కుటుంబంలో   తలెత్తిన రాజకీయ విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.  ఒకప్పుడు ఉద్యమ ప్రస్థానంలో, అధికారంలోనూ కలిసి నడిచిన అన్నచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఇప్పుడు బహిరంగంగానే విమర్శలు చేసుకునే స్థాయికి చేరడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. కవిత కొత్త పార్టీ  ప్రకటించడానికి సమయం దగ్గర పడటం.., దానికి కేటీఆర్ స్పందించిన తీరుపై  ఆ కుటుంబంలో బయటకు తెలియని రాజకీయ యుద్ధం ఏదో జరిగిందని భావిస్తున్నారు.

కేటీఆర్ పరోక్ష బాణాలు - తల్లిదండ్రులను ఏడిపించకూడదు!
 
క్యాతనపల్లిలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిది, కానీ ప్రజలు ఓట్లు వేయాలి కదా  అంటూనే, తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు.. కానీ వారిని ఏడిపించకూడదు  అని ఆయన అన్నారు. ఇది నేరుగా కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే. కవిత తన సొంత రాజకీయ అజెండాతో, ముఖ్యంగా కేసీఆర్ నిర్మించిన పార్టీకి వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా తండ్రిని మానసిక వేదనకు గురిచేస్తున్నారని కేటీఆర్ భావిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

కవిత ఆవేదన -  నన్ను దూరం పెట్టారు!

మరోవైపు, కవిత  ఆవేదన మరోలా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ వివాదం తర్వాత తనను పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టారని ఆమె చెబుతూవస్తున్నారు.  తాను పార్టీ కోసం ఎంతో చేశాను, కానీ కష్టకాలంలో నన్ను ఒంటరిని చేశారు అనే భావన ఆమెలో బలంగా ఉంది. అందుకే, తన ఉనికిని చాటుకోవడానికి, తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవడానికి TRS  పేరుతో కొత్త ప్రయాణాన్ని ఆమె ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ మౌనం - బాధాకరమైన పరిణామం

తల్లిదండ్రుల విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రస్తుత మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. తన ఇద్దరు బిడ్డల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చూసి కేసీఆర్ లోలోపల బాధపడుతున్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఒకవైపు తన వారసుడిగా కేటీఆర్‌ను నిలబెట్టాలని ఆయన ప్రయత్నిస్తుంటే, మరోవైపు తన కూతురు తిరుగుబాటు జెండా ఎగురవేయడం కేసీఆర్‌కు మింగుడుపడని విషయమే. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను ఏడిపించకూడదు  అనే మాట ద్వారా కవితకు కేటీఆర్ ఒక ఎమోషనల్ వార్నింగ్ ఇచ్చారని  అంటున్నారు. 

వారసత్వ యుద్ధం -  T  ఎవరిది?

కేటీఆర్ ఉద్దేశం ప్రకారం.. కవిత తన స్వతంత్ర నిర్ణయాల ద్వారా కేసీఆర్ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కవిత వాదన ప్రకారం.. కేటీఆర్ తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేలా పరిస్థితులు సృష్టించారు. ఈ అన్నచెల్లెళ్ల మధ్య బ్రాండ్  యుద్ధం కూడా నడుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్‌ను ఎవరు ఎక్కువగా ప్రతిబింబిస్తారు? అనే అంశంపై ఇద్దరూ పోటీ పడుతున్నారు. కవిత పాదయాత్రకు సిద్ధమవ్వడం, కేటీఆర్ దాన్ని లైట్ తీసుకోవడం చూస్తుంటే కుటుంబంలో అగాధం ఎంత పెరిగిందో అర్థమవుతోంది.

కుటుంబం ఏకతాటిపై ఉంటేనే బలం

కుటుంబంలో మొదలైన ఈ చిచ్చు పార్టీ మనుగడకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కేటీఆర్ తండ్రి బాధపడుతున్నారన్న   క్రమంలో కవితను విమర్శిస్తుంటే, కవిత తన ఆత్మగౌరవం సొంత రాజకీయ పార్టీ పెడుతున్నారు. ప్రజలు ఈ డ్రామాను గమనిస్తున్నారని, ఇది అంతిమంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీలకు బలమైన అస్త్రంగా మారుతుందని  అభిప్రాయం వినిపిస్తోంది.  రాజకీయాల్లో సెంటిమెంట్ కంటే గెలుపే ముఖ్యం. కానీ ఇక్కడ కుటుంబ బంధాలు, రాజకీయ ప్రయోజనాలు పెనవేసుకుపోయాయి. కవిత తన ఆవేదనతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంటే, కేటీఆర్ మాత్రం ఆమె చర్యలు తల్లిదండ్రులకు శాపంగా మారతాయని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో లేదా ఈ చీలిక గులాబీ పార్టీని ఏ తీరానికి చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Embed widget