అన్వేషించండి

Khammam Politics : బీఆర్ఎస్‌ను వీడుతున్న కీలక నేతలు - ఖమ్మంలో అధికార పార్టీకి గడ్డు పరిస్థితి !

ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో వలసలు పెరుగుతున్నాయి. పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.


Khammam Politics :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీకి గడ్డు  పరిస్థితి ఏర్పడుతోంది. సీనియర్లు ఇప్పటికే పార్టీ మారిపోగా.. ఎన్నికలకు ముందు ద్వితీయ శ్రేణి నేతలు అదే పని చేస్తున్నారు. వారిని అపడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మెన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  తమ అనుచరులందర్నీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. 

కాంగ్రెస్‌లోకి  ఖమ్మం సిటీ బీఆర్ఎస్ కీలక నేతలు 

మాజీ ఎమ్మెల్సీ, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ బాలసాని లక్ష్మీనారాయణ, బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ నగర అధ్యక్షులు, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, కార్పొరేటర్లు చావా మాధురి, రావూరి కరుణ, పోట్ల శశికళ భర్తలు చావా నారాయణరావు, రావూరి సైదుబాబు, పోట్ల వీరేందర్‌, మాజీ కార్పొరేటర్‌ చేతుల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ నేతలు సంక్రాంతి నాగేశ్వరరావు, ఏలూరి శ్రీనివాస్‌.. ఇలా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్‌లో  చేరిపోయారు.  రేవంత్‌రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ మొదటి జాబితా ప్రకటించిన రోజే ఖమ్మం ‘కారు’లో ప్రకంపనలు చోటుచేసుకోవడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపగా.. బీఆర్‌ఎస్‌కు మాత్రం ఇది మింగుడు పడని అంశంగా మారింది. 

మరింత మంది చేజారకుండా మంత్రి పువ్వాడ ప్రయత్నాలు
 
నేతలు పార్టీ వీడుతున్నారని తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అప్రమత్తమయ్యారు. ఆగమేఘాల మీద హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేశారు. అసంతృప్త నేతలు, కార్పొరేటర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన సన్నిహితులను   ఓ కార్పొరేటర్‌ ఇంటికి పంపించి నచ్చజెప్పారు. మరో ముఖ్య నాయకున్ని మమత ఆస్పత్రిలోని మంత్రి ఇంటికి పిలిపించి బుజ్జగించినట్లుగా చెబుతున్నారు.  ఇంకా సుమారు ఏడెనిమిది కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఇంకా పలువురు ‘హస్తం’ గూటికి చేరతారని, ఆట ఇప్పుడే మొదలైందని పొంగులేటి, తుమ్మల ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

బాలసాని రాజీనామాతో బీఆర్ఎస్‌కు షాక్  

ఖమ్మంలో పార్టీ నేతలు రాజీనామా చేస్తూండటంతో కేటీఆర్ కూడా జోక్యం చేసుకుంటున్నారు. సీనియర్ నేతలు వెళ్లిపోయినా  వారి అనుచరులకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇస్తున్నారు. తుమ్మల కీలక అనుచరునిగా ఉన్న  బాలసాని లక్ష్మీనారాయణకు ఎమ్మెల్సీగా  చాన్సిచ్చారు.  పువ్వాడ అజరుకుమార్‌ మంత్రయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలసానికి కాకుండా తాతా మధుసూదన్‌కు బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇచ్చింది. అప్పటి నుంచి పార్టీలో కాస్తంత అసౌకర్యంగానే బాలసాని ఉంటున్నారు. ఈ క్రమంలో బాలసానిని భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా పార్టీ నియమించింది. ఆ తర్వాత పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన తెల్లం వెంకట్రావును తిరిగి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తనకు తెలియకుండా వెంకట్రావును తిరిగి పార్టీలో చేర్చుకోవడమే కాకుండా భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానూ ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన నియోజకవర్గ ఇన్‌చార్జుల జాబితాలో భద్రాచలం బాధ్యతల నుంచి బాలసానిని తప్పించి ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు అప్పగించారు. ఈ పరిణామాలన్నీ బాలసానిని కలిచివేశాయి. దీనికితోడు తన రాజకీయ గురువు తుమ్మల సైతం కాంగ్రెస్‌లో చేరడంతో తాను కూడా ఆయన చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా మంత్రి పువ్వాడ రెండు పర్యాయాలు, మంత్రితో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం ఖమ్మంలోని బాలసాని ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. కేటీఆర్‌ ఫోన్‌ చేసి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారని చెబుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget