అన్వేషించండి

Mancherial News: ఐదంతస్తుల భవనం కూల్చేశారు - మంచిర్యాల జిల్లాలో 'హైడ్రా' ఎఫెక్ట్

Telangana News: తెలంగాణవ్యాప్తంగా 'హైడ్రా' దూకుడు కొనసాగుతోంది. తాజాగా, మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు పోలీసుల సాయంతో కూల్చివేశారు.

HYDRA Demolished Illegal Building In Mancherial District: తెలంగాణలో 'హైడ్రా' (HYDRA) దూకుడు కొనసాగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూములు, ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులతో పాటు సామాన్యులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చేశారు. తాజాగా, గురువారం మంచిర్యాల (Mancherial District) జిల్లాలోనూ హైడ్రా ఎఫెక్ట్‌తో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. నస్పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 42లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. బీఅర్ఎస్ నేత డీకొండ అన్నయ్యకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

ఈ క్రమంలో ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యులను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబరులో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ భవన నిర్మాణానికి సర్వే నెంబర్ 40లో అనుమతులు తీసుకుని సర్వే నెంబర్ 42లో భవన నిర్మాణం చేపట్టారని మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు. 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా డీకొండ అన్నయ్య పట్టించుకోలేదని చెప్పారు. 15 రోజుల కిందట కూడా నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీస్ అధికారుల సాయంతో భవనాన్ని కూల్చివేశామని స్పష్టం చేశారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించామన్నారు. త్వరలోనే వాటిని సైతం గుర్తించి కూల్చివేస్తామన్నారు.

అక్రమార్కుల గుండెల్లో రైళ్లు

మంచిర్యాల జిల్లాలో హైడ్రా ఎఫెక్ట్‌తో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలో తమ తమ ప్రాంతాల్లో కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని అక్కడి స్థానికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా, అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో 'హైడ్రా' పని ఆగదని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని సీఎం రేవంత్ తేల్చిచెప్పారు. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ రాబోయే రోజుల్లో 'హైడ్రా' ప్రభావం ఇలాగే కొనసాగుతుందా.? లేదా.? అనేది చూడాల్సి ఉంది.

Also Read: Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget