అన్వేషించండి

Hyderabad Viral Video: ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్

ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ ఆలస్యమైందనే కారణంగా, సికింద్రాబాద్ కు చెందిన దంపతులు జొమాటో డెలివరీ బాయ్ మీద దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సికింద్రాబాద్‌లో ఆలస్యంగా డెలివరీకి వచ్చిన జోమాటో బాయ్‌పై దంపతుల దాడి.
  • లోకేషన్ సమస్యతో ఆలస్యమని వివరించినా, దంపతులు కర్రతో దాడిచేశారు.
  • సీసీటీవీలో దాడి దృశ్యాలు రికార్డవ్వగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

Zomato Delivery Boy Attacked | హైదరాబాద్: ఇంట్లో కుకింగ్ చేయనప్పుడు, బయటి నుంచి ఇంటివి వచ్చి త్వరగా తినాలనుకుంటే ఆన్‌లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతుంటాం. అయితే ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు సాంకేతిక కారణాల వల్ల లేదా ట్రాఫిక్ వల్ల కొన్నిసార్లు డెలివరీ కాస్త ఆలస్యం కావడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఫుడ్ ఆర్డర్ డెలివరీ లేట్ అయినప్పుడు కొంతమంది ఓపికతో డెలివరీ బాయ్ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. కొందరు వారిని ప్రశ్నించి మాటలు అని పంపించేస్తారు. మరికొందరు మాత్రం సహనం కోల్పోయి డెలివరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భౌతిక దాడులకు పాల్పడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఒక దురదృష్టకర ఘటనే నగరంలోని సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది.

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న వాసవినగర్‌లో ఓ ఫ్యామిలీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. తరువాత ఫుడ్ డెలివరీ బాయ్ ఆశి కాస్త ఆలస్యంగా వచ్చి డెలవరీ చేశాడు. ఆలస్యమైందనే నెపంతో ఒక దంపతులు జొమాటో డెలివరీ బాయ్‌ని ప్రశ్నించగా.. మ్యాప్‌‌లో లొకేషన్ తప్పుగా చూపించడం వల్లే రావడం ఆలస్యమైందని వివరించే ప్రయత్నం చేశాడు. అతడు చెప్పేది పట్టించుకోకుండా ఆ దంపతులు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ మీద విరుచుకుపడ్డారు.

ఫ్లాట్ ముందు ఉన్న కర్రతో మొదట భర్త డెలివరీ బాయ్ మీద దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అతడ్ని తన ఇంటి వైపు తోసుకుంటూ వెళ్లి మరింతగా దాడి చేయాలని చూశాడు. ఎలాగోలా తప్పించుకుని డెలివరీ బాయ్ బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా మహిళ సైతం కర్రతో ఆ అమాయకుడిపై దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడైన డెలివరీ బాయ్, జొమాటో ప్రతినిధుల  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

Frequently Asked Questions

జొమాటో డెలివరీ బాయ్‌కు ఏమి జరిగింది?

సికింద్రాబాద్‌లోని వాసవినగర్‌లో ఫుడ్ డెలివరీ ఆలస్యమైనందుకు ఒక దంపతులు జొమాటో డెలివరీ బాయ్‌పై కర్రతో దాడి చేశారు. ఈ దాడి సీసీటీవీలో రికార్డైంది.

డెలివరీ ఆలస్యం కావడానికి కారణం ఏమిటి?

మ్యాప్‌లో లొకేషన్ తప్పుగా చూపించడం వల్లే డెలివరీ ఆలస్యమైందని డెలివరీ బాయ్ ఆశి వివరించాడు. అయితే ఆ దంపతులు అతని మాటలు వినకుండా దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

బాధితుడైన డెలివరీ బాయ్, జొమాటో ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
IT Raids At Sneha Group: పౌల్ట్రీ దిగ్గజం స్నేహ ఫామ్స్‌కు ఐటీ షాక్.. ఏపీ, తెలంగాణలో 16 చోట్ల తనిఖీలు
పౌల్ట్రీ దిగ్గజం స్నేహ ఫామ్స్‌కు ఐటీ షాక్.. ఏపీ, తెలంగాణలో 16 చోట్ల తనిఖీలు
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Embed widget