అన్వేషించండి

గ్రూప్‌2 వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్- టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలన్ని డిమాండ్ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.

గ్రూప్‌ 2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల డిమాండ్‌లను పరిశీలిస్తామని తెలిపారు. 

వరుసగా వస్తున్న పోటీ పరీక్షలకు ప్రిపేర్  అయ్యే టైం లేదని డిమాండ్ చేస్తూ గ్రూప్ 2 అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆగస్టు 29, 30న జరిగే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. 

టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ ముట్టడికి యత్నించిన అభ్యర్థులతో నాంపల్లి పరిసర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. భారీగా వచ్చిన అభ్యర్థులు వారికి మద్దతు పలికిన రాజకీయా పార్టీల అనుచరులతో ఆప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ రూట్‌లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. 

దీంతో కొందరు అభ్యర్థులను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. రాజకీయ పార్టీల నాయకులను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తూ పోలీసులతో ఘర్షణకు దిగారు. పరిస్థితి మరింత హాట్‌గా మారడంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు స్పందించాల్సి వచ్చింది. 

కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న అభ్యర్థులకు నాయకత్వం వహిస్తున్న కొందరు నాయకులను పిలిచి మాట్లాడారు. వారితో చర్చించి పరిస్థితి వివరించారు. వారిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపేశారు. 

విద్యార్థులతో మాట్లాడిన అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వినతిపత్రం తీసుకున్నామని అందులో తెలిపారు. వారి విన్నపాలను పరిశీలిస్తామన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని వివరించారు. 
ప్రస్తుతానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేశారు అనిత రామచంద్రన్. దీనిపై టీఎస్‌పీఎస్‌సీ స్పష్టమైన ప్రకటన చేస్తుందని అంత వరకు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Balakrishna Health Bulletin: నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
Daughter in law Stab Mother in law: అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?
అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget