News
News
X

Revanth Reddy Demands PM Modi: మా గడ్డపై మాకే అవమానమా - ప్రధాని మోదీ, అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : రేవంత్ రెడ్డి

మా గడ్డ మీదకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పోరాట పరిటమను ప్రస్తావించకపోగా, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లడటం దుస్సాహసమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

FOLLOW US: 

Revanth Reddy Demands PM Modi: మా గడ్డ మీదకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పోరాట పరిటమను ప్రస్తావించకపోగా, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా హైదరాబాద్ వేదికగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లడటం దుస్సాహసమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ గడ్డను, అమరవీరులను, రాష్ట్ర ప్రజలను అవమానించినందుకుగానూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతల ప్రసంగాల్లో అధికార దాహం తప్ప.. తెలంగాణ త్యాగాల గురించి, అమరవీరుల త్యాగాల గురించి గానీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్, శ్రీకాంతాచారిల ప్రస్తావన తీసుకరాకపోవడం తెలంగాణ పట్ల బీజేపీ చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. గత వారం రోజులుగా తెలంగాణ వీధుల్లో బీజేపీ, టీఆర్ఎస్ వీధి నాటకాలు గంగిరెద్దుల వాళ్ల లాగా ఉన్నాయని, ఫ్లెక్సీలతో చిల్లర పంచాయితీ పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.  

తెలంగాణ ప్రజలకు ఒరిగింది శూన్యం
ప్రధాని నరేంద్ర మోదీ సహా యావత్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వస్తుంటే ఇప్పటికైనా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకు సంబంధించి నిరిష్ట ప్రణాళిక ప్రకటిస్తారని ఆశించామని, కానీ ఉకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు శబ్ద కాలుష్యం తప్పు బీజేపీ ప్లీనరీ సమావేశాలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమని రేవంత్ రెడ్డి అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు విభజన చట్టంలో స్పష్టమైన హామీలు ఇచ్చిందని.. గిరిజన వర్సిటీ, ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల పవర్ ప్లాంట్, బయ్యారంలో ఉక్కు కార్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని ప్రశ్నించింది. తెలంగాణ ఏర్పాటు సహకరించామని జబ్బులు చరుకుచునే బీజేపీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అమలు చేయాల్సిన హామీల్లో మాత్రం పూర్తిగా మొండి చేయి చూపిందన్నారు రేవంత్ రెడ్డి. 

పేదవాడి ఖాతాలో రూ.15 లక్షల రూపాయాలు
రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. బీజేపీ అధికారంలోకి రావడానికి నల్లధనం తెచ్చి ప్రతీ పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయాలు వేస్తామని ఇచ్చిన మాట నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను కూడా మోదీ ప్రభుత్వం అటకెక్కించింది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. తెలంగాణ యువతకు దక్కాల్సిన లక్షలాది ఉద్యోగాలు రాకపోవటానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలేనన్నారు. ఉదాధి కరువై యువత ప్రాణాలు తీసుకునే స్థితికి వచ్చారు. ఇంత దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వానికి 8 ఏళ్లుగా ప్రతి నిర్ణయంలో టీఆర్ఎస్ మద్దతిస్తూ వచ్చిందని గుర్తుచేశారు.

ఆదాయం రెండింతలా.. ఆత్మహత్యలెందుకు
దేశంలో రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్నారు. అది చేయకపోగా రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వందలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నది మోదీ ప్రభుత్వం.  అభివృద్ధి విషయంలో మొండి చేయి చూపిన బీజేపీ కనీసం తెలంగాణ సీఎం కేసీఆర్ కుంటుంబం అవినీతిపై సైతం చర్యలు ఎందుకు తీసుకోలేదో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. గడిచిన 3 ఏళ్లుగా కేసీఆర్ అవినీతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర పార్టీ నాయకులు హెచ్చరికలు చేయడం తప్ప ఆ దిశగా ఒక్క అడుగు  పడలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలాగా మారిందని బీజేపీ నేతలు ఆరోపించారని, కానీ కేంద్ర మౌనం వహించిందన్నారు. 
Also Read: PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Published at : 04 Jul 2022 07:57 AM (IST) Tags: CONGRESS Hyderabad PM Modi Amit Shah revanth reddy BJP Plenary BJP Plenary In Hyderabad

సంబంధిత కథనాలు

Robin Hood: రాబిన్ హుడ్ వస్తాడు, సాయం అందిస్తాడు @మిషన్ 75

Robin Hood: రాబిన్ హుడ్ వస్తాడు, సాయం అందిస్తాడు @మిషన్ 75

Video Call Suicide: భార్యకు భర్త వీడియో కాల్, వెంటనే దూలానికి ఉరి! కారణం తెలిసి పోలీసులు షాక్

Video Call Suicide: భార్యకు భర్త వీడియో కాల్, వెంటనే దూలానికి ఉరి! కారణం తెలిసి పోలీసులు షాక్

MLC Mahender Reddy: టికెట్ ఎవరికిచ్చినా పార్టీ కోసమే పని చేస్తా: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

MLC Mahender Reddy: టికెట్ ఎవరికిచ్చినా పార్టీ కోసమే పని చేస్తా: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD

టాప్ స్టోరీస్

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం