అన్వేషించండి

Tollywood Protests: హీరోలకు కోట్లు, మాకు పొట్టకూటి కోసం పాట్లా? గర్జించిన తెలుగు సినీ కార్మికులు

నాలుగేళ్లుగా వేతనాలు పైసా పెంచలేదని, సానూకూలంగా స్పందించే నిర్మాతల షూటింగ్స్ తప్ప మిగతా అన్ని సినిమా షూటింగ్స్ ను బహిష్కరిస్తామంటున్నారు.. సినీ కార్మికులు.

‘‘మూడోళ్లకోసారి వేతనాలను పెంచాలని నిబంధనలు ఉన్నా కనీసం నాలుగున్నరేళ్లు దాటినా వేతనాలు పెంచలేదు. దశాబ్దాలుగా నమ్ముకున్న సినీ ఇండస్ట్రీని వదల్లేక.. ఆర్థిక ఇబ్బందులతో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం’’ అంటూ ఆగ్రహంతో ఉద్యమబాట పట్టారు తెలుగు సినీ కార్మికులు. రోజూ షూటింగ్  సెట్ లో ఉండాల్సిన వారంతా జూబ్లిహిల్స్ లో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని వందలాదిగా ముట్టడించారు. తెలుగు సినిమాలోని 24విభాగాలకు చెందిన కార్మికులు గొంతెత్తి నినదించారు. ఏకంగా తెలుగు, తమిళ సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోయిన పరిస్దితి వచ్చిందంటే, సమస్య ఏ స్దాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కల షూటింగ్ జరుపుకుంటున్న 20కి పైగా చిన్న పెద్ద సినిమాల షూటింగ్స్ సైతం ఆగిపోయాయి. ఏకంగా 40 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి నిరసనబాట పట్టారు. వీరి ఆవేదన ఒక్కటే మేము ప్రతీ ఏడాదీ వేతనాలు పెంచమని అడగడంలేదు. కనీసం మూడేళ్లకొకసారైన 30 శాతం పెంచుతామని మీరే అన్నారు. అలా మూడేళ్లు ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏకంగా నాలుగున్నరేళ్లు దాటిపోయినా ఇప్పటికీ వేతనాలు పెంచలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో పెంచలేక పోయామని సాకు చూపించాలనుకున్నా.. కోవిడ్ తరువాత వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైయ్యాయి. హీరోలు సైతం కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు.

మిగతా నటీనటులకు సైతం మంచి పారితోషకాలు ఇస్తున్నారు. అలా అని మేము గొంతెమ్మ కోర్కెలు కోరడంలేదు. కనీసం వేతనాలు 30 శాతం పెంచమని మాత్రమే డిమాండ్ చేస్తున్నామంటూ కార్మికులు కోరుతున్నారు. సెట్ లో షూటింగ్ మొదలైన రోజు నుండి తెల్లవారు జామున 5 గంటలకు విధులకు హజరైన సినీ కార్మికులంతా వివిధ విభాగాల్లో అర్దరాత్రి వరకూ పనిచేసిన రోజులున్నాయని, కనీసం పిల్లలను పలకరించే సమయం కూడా లేనంతగా తమ జీవితం సినీ ఇండస్ట్రీకి అంకితం చేసుకుంటున్నామని గుర్తు చేసుకుంటున్నారు. భార్యా భర్తలు ఇదే వృత్తిలో ఉన్నవారైతే ఇంక వాళ్ల కష్టాలు చెప్పక్కర్లేదని, ఎవరు ఎప్పుడు వెళ్లి, ఎప్పుడు వస్తారో తెలియక కనీసం ఒకరినొకరు చూసుకునే పరిస్దితి కూడా ఉండదని ‘ABP దేశం’తో తమ ఆవేదన పంచుకున్నారు సిని ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు.

ఇంతలా వెట్టి చాకిిిరి చేస్తున్నా వడ్డీలు, అప్పులు తీర్చేందుకే జీవితం సరిపోతోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. రోజంతా చర్చలు, నిరసనల తరువాత వీరంతా ఓ ప్రధాన డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఏ నిర్మాతలైతే తమకు వేతనాల పెంపుపై సానుకూలంగా స్పందిస్తారో వారి సినిమా షూటింగ్స్ తప్ప మిగతా వాటిని బహిష్కరిస్తామంటున్నారు. లైట్ బాయ్స్, మేకప్ అసిస్టెంట్స్,హెయిర్ స్టైలిస్ట్, వంట వండి, వడ్డించి గిన్నెలు కడిగేవారు. ఇలా ప్రతి చిన్న పని జరగాలంటే 24 విభాగాలకు చెందిన వీరు ఉంటేనే అది వందకోట్ల బడ్జెట్ సినిమా ముందుకు సాగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Advertisement

వీడియోలు

భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Top 5 Most Affordable Cars: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Embed widget