అన్వేషించండి

KCR vs Bandi Sanjay: రాజీనామా చేసే దమ్ముందా కేసీఆర్? చర్చకు డేట్, టైం ఫిక్స్ చెయ్ - బండి సంజయ్ కుమార్

‘‘కేసీఆర్... నువ్వు చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా.... మాటకు కట్టుబడి రాజీనామా చేసే దమ్ముందా? డేట్, టైం ఫిక్స్ చెయ్... బహిరంగ చర్చకు సిద్ధం.. ఆధారాలతో నిరూపిస్తా’’నంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్... నువ్వు చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా.... మాటకు కట్టుబడి రాజీనామా చేసే దమ్ముందా? డేట్, టైం ఫిక్స్ చెయ్... బహిరంగ చర్చకు సిద్ధం.. ఆధారాలతో నిరూపిస్తా’’నంటూ సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ గురించి బీఆర్ఎస్ నేతలు  రైతుల వద్దకు పోయి చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను రైతులంతా ఉరికించి కొడతారని వ్యాఖ్యానించారు. 

దేశ జీడీపీ గురించి కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా ఎదిగిన విషయాన్ని ఐఎంఎఫ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే అసెంబ్లీలో అబద్దాలాడారని విమర్శించారు. కేసీఆర్ పెద్ద డిఫాల్టర్ ముఖ్యమంత్రి అని, ఆయన మాటలు నమ్మేదెవరని అన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టినా 56 వేల జీవోలను వెబ్ సైట్లో పెట్టకుండా దాచిన కేసీఆర్ మోదీ పాలన గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందో చెప్పాలని, ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదో సమాధానం చెప్పాలన్నారు. పహిలీ బార్ దళిత్ సర్కార్ ఎంత నిజమో.... అబ్ కీ బార్ ఆబ్కారీ సర్కార్ అంతే నిజమని ఎద్దేవా చేశారు. అబద్దాలతో అసెంబ్లీని మలినం చేసిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

2024లో మోదీ ప్రభుత్వం పనైపోతోందంటూ కేసీఆర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... ‘‘ఈ ఏడాదే కేసీఆర్ ఖేల్ ఖతం కాబోతోంది. ప్రజలు బీఆర్ఎస్ ను పాతిపెట్టబోతున్నారు’’అని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను ఎందుకు ఓడిస్తారో చెప్పిన బండి సంజయ్ బీజేపీకి ఎందుకు ఓటేస్తారనే విషయాన్ని వివరించారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి. మనోహర్  రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..
-  అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నించడం దుర్మార్గం... ఆయన అబ్దాలకు అసెంబ్లీ మలినమైంది. మోదీని తిట్టడానికి, కేంద్రాన్ని బదనానికి తప్ప అసెంబ్లీలో మాట్లాడిందేమీలేదు. బడ్జెట్ ప్రస్తావనే లేదు. ప్రజల దారి మళ్లించేందుకు అన్నీ అబద్దాలు వల్లించిండు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడొచ్చా? గతంలో నేను పార్లమెంట్ లో మాట్లాడితే నాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కదా... ఇయాళ మీరు చేసిందేమిటి? కేసీఆర్ ను ఇతర రాష్ట్రాల ప్రజలు, పార్టీలు నిన్ను జోకర్ లా చూస్తున్నరు.

-  అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్దాలే... ఆధారాలతో సహా నిరూపించేందుకు మేం సిద్ధం. రాజీనామాకు సిద్ధం కావాలి. డేట్, టైం డిసైడ్ చెయ్... మేం నిరూపిస్తాం.. రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధమా? తెలంగాణకు పట్టిన శని పోతది. దమ్ముంటే చెప్పిన మాటకు కట్టుబడాలి.  నీ బిడ్డ లిక్కర్ స్కాంపై ఇంతవరకు నోరు మెదపలేదు... ఇయాళ ఎవరో పుస్తకం రాస్తే అసెంబ్లీలో చదివి విన్పించి మోదీని తిడతావా?... నీపై లక్షల పుస్తకాలు రాశారు. ఎవడి పాలైందరో తెలంగాణ అని పాటలు రాశారు.. అవి అసెంబ్లీలో చదివి విన్పిస్తావా?

-  కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదా? మరి ఎవరిచ్చారు? పాకిస్తాన్, చైనా ఇచ్చిందా? ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి హామీ ఏమైంది? ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల్లేవు. స్టాఫ్ నియామకాల్లేవు.  దేశ ఆర్దిక వ్యవస్థ గురించి అడ్డగోలుగా అబద్దాలు... 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు జీడీపీ గురించి తెల్వదా? ఆర్దిక వ్యవస్థతో ప్రపంచం అల్లాడుతోంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రధానులే రాజీనామా చేసి దిగిపోయారు.. ప్రపంచమంతా దేశ ఆర్ధిక వ్యవస్థవైపే చూస్తోంది. అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న ఆర్దిక వ్యవస్థ మనదే. 11 నుండి 5వ స్థానానికి చేరుకున్నాం.  దీనికి కారణం ఎవరు మోదీ కాదా?

-  మోదీ పాలనలో నో అవేలెబుల్ డేటానా?... సిగ్గుండాలే.. 56 వేల జీవోలను వెబ్ సైట్లో పెట్టకుండా దాచుకున్న నువ్వా మాట్లాడేది. కోర్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా సిగ్గు రాలేదు. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఏమైంది? ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు? సర్వేకు సహకరించకుంటే రేషన్ కార్డులియ్యం... కేసులు పెడతాం.. తెలంగాణ వాదులైతే రండి అన్నవ్.. ఏమైంది?. ట్రిబ్యునల్ గురించి మాట్లాడటం సిగ్గు చేటు. క్రిష్ణా జలాల వాటా విషయంలో రాజీపడి పక్క రాష్రమొళ్ల పైసలకు అమ్ముడుపోయిన దొంగవు నువ్వు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినవ్...  575 టీఎంసీల నీటిలో 200 టీఎంసీల నీటిని వాడుకోలేని అసమర్ధుడివి నువ్వు.

తెలంగాణ రాకముందు 18 లక్షలున్న బోర్లు.. ఇయాళ 26 లక్షలకు ఎందుకు చేరాయో చెప్పే దమ్ముందా?. మిషన్ భగీరథతో మంచి నీళ్లు ఎక్కడొస్తున్నయ్. బట్టలు ఉతకడానికి కూడా పనికిరాని మురికి నీళ్లు  వస్తున్నయ్. తాగునీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి. రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టి సాధించేదేమిటి? 

-  డిస్కంలు 70 వేల నష్టాల్లో ఉన్నయి. ప్రభుత్వ శాఖలే రూ.20 వేల కోట్ల బకాయిలున్నయ్. సింగరేణిలో ఓపెన్ కాస్టులు లేకుండా చేస్తానన్నవ్? ఏమైంది? సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రకటించారు. నువ్వు ప్రమాణం చేస్తావా ప్రైవేటీకరణ చేయబోనని... సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని 49 శాతం వాటా ఉన్న కేంద్రానికి ప్రైవేటీకరణ ఎలా చేస్తుంది? కేసీఆర్ కుటుంబం సింగరేణి నుండి విపరీతంగా డబ్బులు దండుకుంటోంది.  

-  వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నవని మళ్లీ అబద్దాలు.. రైతుల వద్దకు పోయి ఇదే మాట చెప్పే దమ్ముందా?... రోడ్లపై నిన్ను ఉరికించి కొడతారు. పొలాలన్నీ కరెంట్ లేక ఎండిపోతున్నయ్. రైతులు చచ్చిపోతున్నరు. కేసీఆర్ మాటలు విని ఎమ్మెల్యేలు సభలో నవ్వుకుంటున్నరు.  కరెంట్ రావట్లేదని రైతులే తిరగబడుతుంటే.. ఇన్ని అబద్దాలా?

-  పహిలీ బార్ దళిత్ సర్కార్ ఎంత నిజమో... అబ్ కీ బార్ ఆబ్కారీ సర్కార్ అంతే నిజం. వడ్ల కుప్పలపై రైతులు చస్తే పట్టించుకోని దుర్మార్గుడు కేసీఆర్... రైతు బంధు సాకుతో సబ్సిడీలన్నీ బంద్ చేసిన నీచుడు కేసీఆర్... ఫ్రీ యూరియా హామీ అమలు చేయని మోసగాడు కేసీఆర్.. రుణమాఫీ కాక ప్రైవేటు వాళ్ల వద్ద అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.  మోదీ ప్రభుత్వం యూరియా సబ్సిడీ ఇస్తోంది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. కనీస మద్దతు ధర పెంచింది.

-  కాగ్ రిపోర్ట్ పై వ్యంగ్యంగా మాట్లాడిన కేసీఆర్ ఇయాళ... ఆ కాగ్ నివేదిక ప్రస్తావించడం సిగ్గు చేటు. నిర్మలా సీతారామన్ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వస్తే.. నీ బండారం బయటపడింది. గరీబ్ కళ్యాణ్ యోజన కింద మోదీ ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే... పేదల దగ్గర కిలోకు రూపాయి చొప్పున వసూలు చేసి నువ్వు చేసిన మోసాన్ని బయటపెట్టారు. నువ్వు ఏం చేసినవని నీ ఫోటో రేషన్ షాపుల దగ్గర పెట్టాలే?. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ.165 కోట్ల సబ్సిడీ ఇస్తే పట్టించుకోని కేసీఆర్ ఇయాళ అసెంబ్లీలో ఫుడ్ ప్రాసెసింగ్ గురించి చెప్పడం సిగ్గు చేటు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Maharastra CM: ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Embed widget