Revanth Reddy on Kurnool Accident: కర్నూల్ బస్సు ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. హైదరాబాద్ లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు
కర్నూలు జిల్లాలో ప్రవేటు ట్రావెల్స్ బస్సు దగ్దమైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బాధితుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతోపాటు , తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన తక్షణ సహాయక చర్యలు తీసుకొవాంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ప్రమాదంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడిన సీఎం రేవంత్ వెంటనే బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించడంబతోపాటు గద్వాల్ జిల్లా కలెక్టర్ , ఎస్పీలు వెంటనే ఘటనా స్దలానికి వెళ్లాలంటూ ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మృతుల గుర్తింపుతో పాటు క్షత గాత్రులకు అవసమైన వైద్య సహాయం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. కేసీఆర్
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.. కేంద్రమంత్రి బండి సంజయ్
కర్నూలు జిల్లాలో బస్ ఘోర ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాద దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడంట్ల ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు . క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని కోరారు బండి సంజయ్
ఏపీ రవాణాశాఖా మంత్రి, అధికారులతో మాట్లాడా.. మంత్రి పొన్నం
బస్సుప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖకు స్పష్టమైన ఆదేశాలుజారీ చేశారు. ఏపి, తెలంగాణ ,కర్నాటక మధ్య రోజూ వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. త్వరలో ఏపి, తెలంగాణ,కర్నాట రవాణాశాఖ మంత్రులు, అధికారులతో ప్రమాదాలపై ప్రత్యేక సమాశం ఏర్పాటు చేస్తామన్నారు పొన్నం.స్పీడ్ లిమిట్ విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బస్సులను ప్రతీ రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నారు, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదం జరిగిన బస్సు ఒడిస్సాలో రిజిస్ట్రేషన్ అయ్యిందని, హైదరాబాద్ టూ బెంగుళూరు తిరుగుతోందన్నారు.క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించాలని ఏపి ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.
భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా.. కవిత
బస్సు దగ్దమైన ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్లకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళుతున్న ప్రవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన ఘటనలో 20మందికి పైగా మరణించడం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది.బస్సు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మ శాంతించాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాన్నారు.
హైదరాబాద్ లో హెల్ప్ లైన్...
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
హెల్ప్ లైన్ నెంబర్లు.. సంప్రదించాల్సిన అధికారులు:
9912919545 ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ
9440854433 ఈ.చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్





















