అన్వేషించండి

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉంది. కానీ, ఆ ప్రత్యేక విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబరు 1న తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చి ప్రధాని మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే, ముందస్తుగా ఖరారైన షెడ్యూల్‌లో కాకుండా ప్రధాని షెడ్యూల్‌లో చిన్న మార్పులు జరిగాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉంది. కానీ, ఆ ప్రత్యేక విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించనున్నారు. అయితే, ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అక్టోబర్ 1న మధ్యాహ్నం 1:30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మోదీ ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి 1:35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ‌లో మహబూబ్‌ నగర్‌కు బయలుదేరనున్నారు.

2:10 గంటలకు మహబూబ్‌ నగర్ హెలిపాడ్ వద్దకు మోదీ చేరుకుంటారు. 2:15 గంటల నుంచి 2:50 వరకు మహబూబ్‌ నగర్‌లోనే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత ఓ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ వేదికకు మోదీ రానున్నారు. 4 గంటల వరకు బహిరంగ సభ వద్దే నరేంద్ర మోదీ ఉంటారు. ప్రసంగం ముగించిన తర్వాత 4:10 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి అదే ప్రత్యేక హెలికాప్టర్‌ లో శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు బయలుదేరతారు. 4:45 శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు ప్రధాని చేరుకొని 4:50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో మోదీ తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌ మోసం- కేస్ నమోదు 
తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌ మోసం- కేస్ నమోదు 
SBI Caps Hyderabad Metro Valuation: హైదరాబాద్ మెట్రో టేకోవర్ మిస్టరీ - ఎల్‌అండ్‌టీ నిష్క్రమణ వేళ ఎస్‌బీఐ క్యాప్స్ ఎంట్రీ.. సమస్య తీరినట్లా? మొదటికి వచ్చినట్లా?
హైదరాబాద్ మెట్రో టేకోవర్ మిస్టరీ - ఎల్‌అండ్‌టీ నిష్క్రమణ వేళ ఎస్‌బీఐ క్యాప్స్ ఎంట్రీ.. సమస్య తీరినట్లా? మొదటికి వచ్చినట్లా?
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

వీడియోలు

IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Latest News: తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
Hyderabad Bullet Train Corridor: బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Gade Sai Krishna Case: సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
Baahubali 3 Update : బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Singer Sunitha : మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
Embed widget