అన్వేషించండి

Singareni Elections: అసెంబ్లీ ఎన్నికలకు మించి సింగరేణి ఎలక్షన్స్‌లో ప్రచారం- కార్మికుల ఓట్ల కోసం వరాల జల్లు

Singareni Elections: తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. 

Singareni Elections 2023: తెలంగాణలో సింగరేణి ఎన్నికల (Singareni Elections)కు సర్వం సిద్ధమైంది. 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో... 39వేల మంది బొగ్గు గని కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 650 మంది ఎన్నికల్లో విధుల్లో పాల్గొంటుంటే, 460 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.  పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ఉంటుంది.  సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్‌ కాస్ట్‌ గనులు ఉన్నాయి. 1998 నుంచి కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగు సంవత్సరాలు. సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నిక‌ల్లో 13 యూనియ‌న్లు పోటీ ప‌డుతున్నా, కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ అనుబంధ యూనియ‌న్ల మ‌ధ్యే ఉండ‌నుంది. బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయొద్దని కేసీఆర్ ఆదేశించారు. దీంతో ప్రచారం కూడా ఆశించిన స్థాయిలో చేయలేదు. గుర్తింపు సంఘానికి ముగ్గురు ముఖ్య నేతలు రాజీనామా చేశారు.

రెండేళ్లు ఆలస్యంగా ఎన్నికలు
తెలంగాణ ఉద్యమం సమయంలో సింగరేణిలో టీజీబీకేఎస్‌ బలపడింది. 2012, 2017 కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది. 2017లో ఏకంగా టీజీబీకేఎస్‌ తొమ్మిది ఏరియాల్లో సత్తా చాటింది. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ మందమర్రి, భూపాలపల్లి ఏరియ్లాలోనే గెలుపొందింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో, ఈ ఎన్నికలపై ఆసక్తి పెంచింది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్‌టీయూసీ, మెజారిటీ ఏరియాలను గెలుపొందడానికి వ్యూహాలు అమలుచేస్తోంది. 2021 అక్టోబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపలేదు. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 30న పోలింగ్‌ జరగాల్సి ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈనెల 27న పోలింగ్‌ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం ఎన్నికలు జగనున్నాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్నారు. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఉన్నారు. 

కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు
ప్రస్తుతం సింగరేణి ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. కార్మికులకు ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటించింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని హామీ ఇచ్చింది. కారుణ్య నియామకాలు చేపడతామని, సింగరేణి దినోత్సవాన్ని సెలవుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, కార్మికుల వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పింది. మహిళా కార్మికులు గని బయటే పని చేసే అవకాశం, కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని వరాలిచ్చింది అధికార కాంగ్రెస్ పార్టీ. సింగరేణి గనులు ఉన్న ప్రాంతాల్లో ఒక్క చోట తప్ప అన్ని చోట్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget