Alpha Hotel: సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు - రెండు గంటలపాటు తనిఖీలు
Alpha Hotel News: శనివారం రాత్రి 10.45 గంటలకు 100 నంబర్‌కు ఫోన్ చేసి ఆగంతుకుడు బెదిరించాడు. వెంటనే పోలీసులు ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకున్నారు.

Alpha Hotel gets Bomb Threatening Call: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ హోటల్, చుట్టు పక్కల పరిసరాలు నిత్యం రద్దీగా ఉంటుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. బాంబు ఉందని ఓ అజ్క్షాత వ్యక్తి ఫోన్ చేసినట్లు తెలిసింది. శనివారం రాత్రి 10.45 గంటలకు 100 నంబర్‌కు ఫోన్ చేసి ఆగంతుకుడు బెదిరించాడు. వెంటనే పోలీసులు ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న హోటల్ సిబ్బందిని బయటకు పంపించేసి.. హోటల్ ను మూసేసి 2 గంటల పాటు లోపల బాంబు కోసం వెతికారు. చివరకు ఆ హోటల్‌లో బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ తేల్చారు. ఫోన్ చేసింది ఆకతాయి అని వివరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఫోన్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామని డీసీపీ సుబ్బారాయుడు, ఏసీపీ శివమర్తి వెల్లడించారు.
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు





















