అన్వేషించండి

Telangana Lates News: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Telangana Lates News: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన హనీమూన్‌ కామెంట్స్ హాట్‌ డిబేట్‌కు కారణమయ్యాయి. ఆయనపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.

Telangana Lates News: రంగారెడ్డిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. తనను దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రోటోకాల్ విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది. 

నియోజకవర్గంలోని మున్సురాబాద్‌ పరిధిలో కొన్ని అభివృద్ధి పనులకు సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది స్థానిక కార్పొరేటర్‌ను పిలవకుండా కార్యక్రమం చేపట్టడంపై ఆ స్థానంలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పిలువకుండా ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. 

విమర్శలతో ఆగిపోని మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అనుచరులతో వెళ్లి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన్ని వారి అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

శంకుస్థాపన ఏరియాలో బీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల పోటాపోటీ ఆందోళనలు, నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

స్టేషన్‌లో తన అనుచరులు ఉన్నారని తెలుసుకున్న సుధీర్ రెడ్డి హుటాహుటిని పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అరెస్టు అయ్యి స్టేషన్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులను పరామర్శించారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు ఆయనపై విమర్సలకు కారణమయ్యాయి. 

స్టేషన్‌లో ఉన్న అనుచరులతో సమావేశమై వచ్చిన సుధీర్ రెడ్డి... కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, సుజాత నాయక్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుధీర్‌ రెడ్డి తనను దూషించారని ఎల్పీనగర్ పీఎస్‌లో బానోతు సుజాత ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నమోదుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. దీన్ని న్యాయస్థానంలో ఎదుర్కుంటానని అన్నారు. కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కూడబలుక్కుని తనపై అక్రమ కేసు బనాయించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని ఎండగడుతూనే ఉంటామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
UDID Card Apply Online: దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
ACB Raids On DSP Bheem Reddy: ఏసీబీ వలలో సైబరాబాద్ డీఎస్బీ భీమ్ రెడ్డి - ఈ సారు లెక్క కూడా దాదాపుగా వంద కోట్లే !
ఏసీబీ వలలో సైబరాబాద్ డీఎస్బీ భీమ్ రెడ్డి - ఈ సారు లెక్క కూడా దాదాపుగా వంద కోట్లే !
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget