Renovative Women Policestation: మహిళలు, చిన్నారుల భద్రత కోసం గచ్చిబౌలిలో ప్రత్యేక పోలీస్ స్టేషన్
Renovative Women Police Station: మహిళలు, చిన్నారుల భద్రత ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.
Renovative Women Policestation: రోజురోజుకు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఫిర్యాదు చేసే వారికి అవమానాలు, వేధింపులు మరో రకంగా బాధనే మిగుల్చుతున్న తరుణంలో ...మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ... పోలీసుశాఖ మరో అడుగు ముందుకు వేసింది. మహిళలు చిన్నారులపై జరిగే హింసను, నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా.... హైదరాబాద్ గచ్చిబౌలిలో రినవేటెడ్ విమెన్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించింది. ఈ PSను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్, ప్రారంభించారు.
మహిళలకు, చిన్నారులకు భద్రత కోసం ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులపై హింసాత్మక ఘటనలు రోజు రోజుకి అధికమవుతున్న వేళ వారి భద్రతకు పెద్ద పీట వేస్తూ ఈ కార్యక్రమాలనికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా స్టీఫెన్ రవీంద్ర విమెన్ పోలీసు స్టేషన్ లో నూతనంగా రెనవేట్ చేసిన చేసిన కిడ్స్ ప్లే ఏరియా, రిసెప్షన్ స్టాఫ్, కౌన్సిలింగ్ రూములను పరిశీలించారు. విమన్ పోలీసుస్టేషన్ పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడికి సమస్యతో వచ్చిన వారితో రిసెప్షన్ సిబ్బంది మర్యాదతో మెలగాలని, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కౌన్సిలర్ల ఓపికగా ఉంటూ సమస్యలను అడిగి తెలుసుకొని,... కౌన్సిలింగ్ కు వచ్చే వారికి సూచనలు ఇవ్వాలని తెలియజేశారు.
CP Shri Stephen Raveendra, IPS, inaugurated the renovated Women Safety PS in Gachibowli and inspected the premises and records. He instructed the officers that women & child safety should be their top priority & discussed violence against women, POCSO etc.#WomenAndChildren pic.twitter.com/TLUeGkqlZe
— Cyberabad Police (@cyberabadpolice) December 16, 2022
గృహ హింసకు గల కారణాలు, ఎక్కువగా ఏ కారణాలతో దంపతులు విడిపోతున్నారు, సహజీవనం, పొక్సో కేసుల నమోదు తదితర విషయాలను సిబ్బందికి వివరించడంతోపాటు, సలహాలు, సూచనలు అందించారు. గత మూడు సంవత్సరాలుగా నమోదైన కేసుల, కౌన్సిలింగ్ డేటాను విశ్లేషించి సమస్యలకు గల ముఖ్య కారణాలను విశ్లేషించాలన్నారు. ఇందుకు అవసరమైతే TPCC సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) సహాయం తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశించారు. పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు.
ఏయే కారణాలతో ఎక్కువగా కౌన్సిలింగ్ కి వస్తున్నారు, వారికి కౌన్సిలింగ్ ఎలా చేస్తారు... వంటి అంశాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర.... సిబ్బందికి తెలిపారు. మహిళా పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది స్ట్రెంత్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావలన్నారు.
ఇప్పటికే సైబరాబాద్ లో "బాలమిత్ర " ముఖ్య పాత్ర పోషిస్తోందని.... చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టే దిశగా ముందడుగేస్తుందని తెలిపారు. గడిచిన సంవత్సరంలో వందల సంఖ్యలో కేసులు నమోదవడం పై సైబరాబాద్ పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని...తెలిపారు. అలాగే బాధిత మహిళలు కానీ చిన్నారులేవరన్న ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు చెబుతున్నారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ మెరుగైన సేవలు అందిస్తుందని హామీ ఇచ్చారు.