Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
సస్పెండ్ గురైన బిక్షపతి స్థానంలో సీఐగా ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండో మహిళా ఎస్ హెచ్ వోగా పద్మజ నిలవనున్నారు.
P Padmaja SHO of a Sultan Bazar Police Station: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో మహిళా సీఐ ర్యాంక్ అధికారిణికి ఎస్ హెచ్ ఓ (Station House Officer) గా నియమించారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ (Hyderabad city police commissioner C V Anand). శాంతి భద్రతల విభాగంలో పి పద్మజ అనే సీఐ ఎస్‌హెచ్‌వోగా పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఈస్ట్ జోన్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సుల్తాన్ బజార్ ఎస్‌హెచ్‌వోగా ఛాన్స్..
పి. పద్మజ ప్రస్తుతం బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెను సుల్తాన్ బజార్ పీఎస్ ఎస్‌హెచ్‌వోగా కీలక బాధ్యతలు అప్పగించారు కమిషనర్ సీవీ ఆనంద్. బుధవారం (మే 18న) సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో సీఐగా పద్మజ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుల్తాన్ బజార్ సిఐ బిక్షపతి ఇటీవల సస్పెన్షన్ (Sultan Bazaar Inspector Bikshapati was suspended)కు గురైన విషయం తెలిసిందే. సస్పెండ్ గురైన బిక్షపతి స్థానంలో సీఐగా ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండో మహిళా ఎస్ హెచ్ వోగా పద్మజ నిలవనున్నారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించాక.. మొదటి ఎస్‌హెచ్‌వోగా లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు మధులతను గతంలో నియమించారు.
సస్పెండ్ అయిన బిక్షపతి స్థానంలో మహిళా సీఐ..
సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతిపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. సీఐగా బాధ్యతలు స్వీకరించిన బిక్షపతి సివిల్ వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లకు తెరలేపారన్న ఆరోపణలు వచ్చాయి. నగరంలోని సుల్తాన్‌బాజర్, కోఠి, బ్యాంక్ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లోని బడాబాబుల హోటళ్లు, లాడ్జీల్లో కొనసాగుతున్న పేకాటను ప్రోత్సహించారని విమర్శలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత వారం కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ .. సీఐ బిక్షపతిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మరి కొంతమంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉంది.