అన్వేషించండి

TRS News: ఆయన దేశానికే శని, అసమర్థుడు - ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు

TRS Party: అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే మోదీపై ఘాటుగా విమర్శలు చేశారు.

ప్రధాని మంత్రి మోదీ హైదరాబాద్‌ వచ్చి వెళ్లాక టీఆర్ఎస్ నాయకులు ఆయనపై ఘాటు విమర్శలు మరింత పెంచారు. బేగంపేట ఎయిర్ పోర్టులో కొద్ది నిమిషాల పాటు జరిగిన బీజేపీ సభలో ప్రధాని మోదీ నేరుగా కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు నేడు కౌంటర్ ఎటాక్ చేశారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే మోదీపై ఘాటుగా విమర్శలు చేశారు.

కుటుంబ పార్టీలపై మాట్లాడే నైతికత బీజేపీకి లేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆ పార్టీలో ఒకే కుటుంబానికి చెందినవాళ్లు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడ్డారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కుటుంబం త్యాగాలు చేసిందని అన్నారు. ఇలాంటి వాళ్లు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దేశంలో నియంతృత్వ పాలన చేస్తున్న దుర్మార్గుడు అంటూ బాల్క సుమన్ దూషించారు. అసలు దేశ చరిత్రలోనే ఇలాంటి అసమర్థ ప్రధానిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. దేశ సంపదను అదానీకి, అంబానీలకు దోచిపెడుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. మోదీ దేశం కోసం పని చేస్తున్నారా? లేక ప్రైవేటు సంస్థలు, దోస్తుల కోసమా అంటూ నిలదీశారు. కరోనా వైరస్ దేశంలో ఉన్న సమయంలో ఆయన అసమర్థ పాలనను ప్రపంచమంతా చూసిందని ఆరోపించారు.

రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, వినతులు, హామీలపై మోదీ ఏ రోజూ సానుకూలంగా స్పందించలేదని అన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో కూడా మోదీ పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణలోని 7 మండలాలను పోలవరం ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని అన్నారు. 

అంతేకాక, హైదరాబాద్ కు రావాల్సిన భారీ ఐటీ ప్రాజెక్టు అయిన ఐటీఐఆర్‌ను (ITIR) రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాదా అని నిలదీశారు. అసలు కేంద్రం తెలంగాణకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో సమాధానం చెప్పాలని బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారని నిలదీశారు. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు.

దేశానికి పట్టిన శని -  జీవన్ రెడ్డి
ప్రధాని మీ దేశానికి పట్టిన శని అని జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆ వేషం వేసి ప్రజల్ని మాయ చేస్తారని అన్నారు. వారసత్వ రాజకీయాలకు అడ్డా బీజేపీ అని అన్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం తెలంగాణకు రక్షగా పనిచేస్తుందని కొనియాడారు. ITIR ను రద్దు చేసి మీరు తెలంగాణను ఐటీ హబ్‌గా మారుస్తారా అని ప్రశ్నించారు.

అందుకే స్వాగతం పలకడం లేదు
మోదీ వస్తే సీఎం స్వాగతం చెప్పలేని స్థితిని మీరే తెచ్చుకున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం హామీలు అమలు చేశారని వెల్కమ్‌ చెప్పాలని నిలదీశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మోదీకి స్వాగతం పలకడం లేదని అన్నారు. మూఢ విశ్వాసాలకు ప్రతీక బీజేపీ అని, రానున్న రోజుల్లో ఆ పార్టీ జీరోగా మారుతుందన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Telangana Group 2 Hall Tickets 2024: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Nithiin : నిర్మాత దిల్ రాజును దారుణంగా వాడేస్తున్న నితిన్.. మరీ ఇంతగానా!
నిర్మాత దిల్ రాజును దారుణంగా వాడేస్తున్న నితిన్.. మరీ ఇంతగానా!
Embed widget