KTR: నగరంలో 185 చెరువులు.. వీటిపై కీలక నిర్ణయం, మంత్రి కేటీఆర్ ఆదేశాలు
హైదరాబాద్‌లో చెరువులపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు కేటీఆర్ ఆదేశాలిచ్చారు.
హైదరాబాద్ నగరంలోని చెరువులను మరింతగా అభివృద్ధి పరిచేందుకు.. వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా ఓ కమిషనర్‌ని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు కేటీఆర్ ఆదేశాలిచ్చారు. గత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలోని చెరువుల సుందరీకరణ, అభివృద్ధి, వాటి పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతూ వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
నగర పరిధిలో 185 చెరువులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్, శివారు చెరువులను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటి అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత స్పెషల్ కమిషనర్‌కు అప్పగిస్తామని ఆయన తెలిపారు. చెరువులపై గ్రీన్ కవర్ పెంచడం లాంటి బాధ్యతలను స్పెషల్ కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ పని చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ఒక కమిషనర్‌ని నియమించడం ద్వారా ఈ కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో 185 చెరువులు మరియు ఇతర జల వనరులు ఉన్నాయని వీటిని అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత స్పెషల్ కమిషనర్ కి అప్పగిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
MA&UD Minister @KTRTRS held a review meeting on status of ongoing development works taken up in @GHMCOnline limits. Special Chief Secretary @arvindkumar_ias & senior officials from the Dept participated. pic.twitter.com/9nnYS5k6CE
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 13, 2021
కేసీఆర్ సంతాపం మరోవైపు, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో ఆస్కార్ ఫెర్నాండెజ్ రోడ్డు రవాణా మంత్రిగా పనిచేశారని అన్నారు. తొలి యూపీఏ ప్రభుత్వంలోని కేబినెట్‌లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
Also Read: Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి మెగా ప్లాన్! ఇప్పటికే అమల్లోకి.. సక్సెస్ అవుతుందా?