అన్వేషించండి

KTR Sensational Comments: తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది, అక్రమ కేసులే వారి మార్గం: కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మ‌రోసారి నోటీసులు ఇవ్వ‌నుంది. నేటి ఉదయం విచారణకు వచ్చిన కేటీఆర్ వాహనాన్ని గేటు వద్ద ఏసీబీ అధికారులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ ను మాత్రమే విచారణకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు. లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని, అది తన హక్కు అన్నారు కేటీఆర్. విచారణ లాయర్ల సమక్షంలో జరగడం ఇదేమీ కొత్త కాదని, ప్రస్తుతం తన కేసు విచారణలో ఉందన్నారు. అరెస్ట్ చేయకూడదని సైతం హైకోర్టు చెప్పిందని.. చట్ట ప్రకారం తాను నడుచుకుంటున్నట్లు చెప్పారు. అరగంటకు పైగా వేచి ఉన్నా, లాయర్ సమక్షంలో విచారణకు అనుమతివ్వకపోవడంతో కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లిపోయారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. దర్శకుడు రాజమౌళి కంటే గొప్పగా పోలీసులు, అధికారులు కథలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. లాయర్లను అనుమతించకపోవడం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఈ కేసు వల్ల రేవంత్ రెడ్డి సాధించేది ఏం లేదు. అయితే తనను ఏసీబీ ఆఫీసులో కూర్చోబెట్టి తన ఇంటికి పోలీసులను పంపించి తనిఖీలు పేరుతో వేధింపులకు గురిచేయాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే తన విషయాలో చేయాలని సర్కార్ చూస్తోందన్నారు. పోలీసులు రేవంత్ రెడ్డి ఇచ్చే పేపర్లు, ఇతర వస్తువులు తీసుకెళ్లి తన ఇంటికి వెళ్లో ఏదో చోట పెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ఫార్ములా ఈ రేసుతో గ్రీన్ కో నష్టపోయింది: కేటీఆర్
హైదరాబాద్‌: గ్రీన్‌కో ఎన్నికల బాండ్ల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. గ్రీన్‌ కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని పేర్కొన్న కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సైతం ఆ సంస్థ బాండ్లు ఇచ్చిందన్నారు. గ్రీన్ కో బాండ్లు ఇచ్చిన ఏడాదికి 2023లో ఫార్ములా ఈ-రేసు జరిపామని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేసు నిర్వహణ వల్ల గ్రీన్ కో సంస్థ నష్టాల పాలైందన్నారు. ఎన్నికల బాండ్లు అనేది చట్టబద్ధమే అయినప్పుడు, వాటికి పార్లమెంట్ అనుమతిస్తుంటే అవినీతి ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎలక్షన్ బాండ్లతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని పార్టీల బాండ్లపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గ్రీన్ కో బీఆర్ఎస్ కు రూ.41 కోట్లు చెల్లించడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. గ్రీన్‌కో దాని అనుబంధ సంస్థలు ఏప్రిల్‌ 8, 2022 నుంచి అక్టోబర్ 10 మధ్య 26 సార్లు బాండ్లు కొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. 

(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్‌ కోసం రిఫ్రెష్ చేయండి)

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Embed widget