By: ABP Desam | Updated at : 02 Oct 2023 04:07 PM (IST)
జూపల్లికి టికెట్ ఇస్తే, నేను కూడా పోటీ చేస్తా: జగదీశ్వర్ రావు
Kollapur Congress Ticket Issue:
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ లో భారీగా చేరికలు జరిగాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడంతో హస్తం పార్టీ బలోపేతం అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు పార్టీలో టికెట్ల లొల్లికి ఫిరాయింపులు కారణమవుతున్నాయి. పార్టీనే నమ్ముకున్న తమను కాదని, వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ వివాదం నెలకొంది. మొదటి నుండి పార్టీకోసం కష్టపడ్డ తనకు కాకుండా, నెల కింద వచ్చిన జూపల్లి కృష్ణరావుకు ఎలా టికెట్ ఇస్తారు? అని కొల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ రావు ప్రశ్నించారు.
కొల్లాపూర్ టికెట్ తనకే వస్తుందని ఆశించినట్లు జగదీశ్వర్ రావు చెప్పారు. మొదట్నుంచీ పార్టీ కోసం కృషిచేసిన తనకు కాకుండా నెల రోజుల కింద పార్టీలో చేరిన జూపల్లికి టికెట్ ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. సర్వే ప్రకారం టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. నిన్నా మొన్న వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని హితవు పలికారు. మొదట్నుంచీ కష్టపడ్డ తాను ఉండగా జూపల్లి కృష్ణారావు టికెట్ అడగటం భావ్యం కాదన్నారు.
మాజీ మంత్రి జూపల్లికి కాంగ్రెస్ అగ్రనేతల మద్దతు ఉండగా, ప్రజాశీర్వాదం తనకే ఉందన్నారు. నేతలు జూపల్లికి జై కొట్టినా, ప్రజలు మాత్రం తానే బరిలో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. జనం తన వెంట ఉన్నారు కనుక కచ్చితంగా తాను పోటీలో ఉంటానన్నారు. ఎన్ని సర్వేలు చేసినా కొల్లాపూర్ లో గెలిచేది జగదీశ్వర్ రావు అని వచ్చిందన్నారు. ప్రజా మద్దతు ఉన్న తనకు ఛాన్స్ ఇచ్చి మరోసారి టికెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరారు. సర్వేలే ప్రామాణికం అయితే తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాని పక్షంలోనూ బరిలో ఉంటానని జగదీశ్వర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ జూపల్లికి ఇక్కడ టికెట్ పై నమ్మకం లేకపోతే, టికెట్ రాదని భావిస్తే వేరే పార్టీలో చేరే వారని కొల్లాపూర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ మాజీ నేత జూపల్లి కృష్ణారావు ఆగస్టు నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో జూపల్లితోపాటు మరికొందరు నేతలు పార్టీలో చేరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి చేరికతో పార్టీకి ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ ఠాక్రే, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్, మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జూపల్లి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటంలో భాగంగా మంత్రి పదవిని సైతం వదులుకున్నారు జూపల్లి. అనంతరం 2011 అక్టోబరు 30న కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఆయన.. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2018లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన జూపల్లి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో చేరడంతో జూపల్లికి పొసగడం లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని భావించిన జూపల్లి కృష్ణారావు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
Revanth Reddy Tweet: 'అంతకు మించిన తృప్తి ఏముంటుంది.?' - ప్రజాదర్బార్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
KCR Health: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ప్రార్థనలు, ప్రధాని మోడీ ట్వీట్
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి- మంత్రివర్గ విస్తరణ శాఖ కేటాయింపుపై చర్చలు
ప్రజాభవన్ వద్ద కేసీఆర్ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్
CM Revanth On KCR Health: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల-ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?
/body>