News
News
X

Malla Reddy News: మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో రూ.కోట్ల డబ్బు సీజ్ - వెలుగులోకి కొత్త విషయాలు!

మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో అధికారులు కొత్త విషయాలను గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది!

FOLLOW US: 
 
తెలంగాణ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజాము (నవంబరు 22) నుంచి ఏకకాలంలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారులు దాదాపు 50 టీమ్‌లుగా ఏర్పడి మల్లారెడ్డి నివాసం సహా ఆయన సంస్థలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డి సన్నిహితుల నుండి ఐటీ అధికారులు భారీగా డబ్బు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సుచిత్రలో మల్లారెడ్డి అనుచరుడైన త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లను సీజ్ చేశారు.

IT Searches in Malla Reddy News: మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రఘునాథ్ రెడ్డి వద్ద రూ.2 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో రఘునాథ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. రఘునాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి రూ.2 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు. మరోవైపు, జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో మల్లారెడ్డికి వరుసకు అల్లుడు అయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా ఐటీ అధికారులు వెళ్లారు. సంతోష్ రెడ్డి తలుపు ఓపెన్ చేయకపోవడంతో ఐటీ అధికారులు వేచి చూస్తున్నారు. డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లే అలోచనలో ఐటీ ఆఫీసర్స్ ఉన్నారు.

కొత్త విషయాలు

మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్‌ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. జైకిషన్‌, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్‌ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్‌ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు అని గుర్తించారు. సీఎంఆర్‌ స్కూల్స్‌లో నరసింహ యాదవ్‌, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహ యాదవ్‌, జైకిషన్‌ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. 

News Reels

క్రాంతి బ్యాంక్‌ చైర్మన్‌ రాజేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ లావాదేవీలను అధికారులు గుర్తించారు. అలాగే కన్వీనర్‌ కోటా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మినట్లుగా అధికారులు గుర్తించారు. ఆయనకు ఉన్న నాలుగు మెడికల్‌ కాలేజీల ట్రాన్సాక్షన్స్ ను కూడా పరిశీలిస్తున్నారు.

తెల్లవారుతుండగానే మొదలైన సోదాలు

మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) నివాసంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 50 బృందాలు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన కుమారుడు, అల్లుడి ఇళ్లల్లో కూడా తనిఖీలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి.

మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు సాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి.

Published at : 22 Nov 2022 03:45 PM (IST) Tags: CH Malla reddy IT Searches Minister Malla reddy Mallareddy collages Malla reddy IT searches news

సంబంధిత కథనాలు

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Minister Mallareddy: కుమారుడిని డాక్టర్ చేస్తే, గిఫ్టుగా మరో డాక్టర్ కోడలుగా వచ్చింది - రెడ్డి అమ్మాయితో పెళ్లి చేసింటే ?

Minister Mallareddy: కుమారుడిని డాక్టర్ చేస్తే, గిఫ్టుగా మరో డాక్టర్ కోడలుగా వచ్చింది - రెడ్డి అమ్మాయితో పెళ్లి చేసింటే ?

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట

Breaking News Live Telugu Updates:  ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట

Sharmila Padayatra: షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వమంటూ వరంగల్ సీపీని కలిసిన వైఎస్‌ఆర్‌టీపీ నేతలు

Sharmila Padayatra: షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వమంటూ వరంగల్ సీపీని కలిసిన వైఎస్‌ఆర్‌టీపీ నేతలు

టాప్ స్టోరీస్

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!