అన్వేషించండి

Women Safety In Hyderabad: వస్తావా.. నీ రేటెంత..? హైదరాబాద్ లో ఆకతాయిల బారినపడ్డ లేడీ ఐపీఎస్ ! వివాదంగా మారిన ఆపరేషన్

Malkajgiri CP Sumathi | హైదరాబాద్‌లో రాత్రిపూట ఒంటరి మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు మల్కాజ్‌గిరి కొత్త సీపీ సుమతి రంగంలోకి దిగారు.

హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటలు దాటితే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బస్టాండ్ ల వద్ద, మెట్రో స్టేషన్ల వద్ద ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు, గద్దల్లా వాలిపోతారు. బైక్స్ పై అమ్మాయి సమీపంలో రౌండ్లు కొడుతూ, కొద్దిసేపు గమనించి, వెంటనే దగ్గరకు వచ్చేస్తారు. వస్తావా మాతో, నీ రేటెంత అంటూ ప్రశ్నల వర్షం కురిపించి వేధింపులకు పాల్పడుతుంటారు. నెమ్మదిగా బేరాలు మొదలెడతారు. ఇలా నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల వద్ద ఇదే తంతు. తాజాగా ఇలాంటి ఆకతాయిలపై దృష్టిపెట్టి, వార్తల్లో నిలిచారు లేడీ సింగం, మల్కాజ్ గిరి నూతన పోలీస్ కమిషనర్ సుమతి.

దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ వద్ద..

మల్కాజిగిరి సీపీగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే, టార్గెట్ ఆకతాయిలు అంటూ రంగంలోకి దిగారు. అర్దరాత్రి 12 గంటలకు దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్ వద్దకు సివిల్ డ్రస్  చేరుకున్న పోలీస్ కమిషనర్ సమతి. రోడ్డుప్రక్కన సాధారణ మహిళలా నిల్చున్నారు. అటుగా వెళుతున్న ఆగతాయిలు, ఆమెను గమనించడం మొదలు పెట్టారు. అలా కొద్దిసేపటికే ఒక్కొక్కరుగా ఆమె చుట్టూ చేరుకున్నారు. హలో వస్తావా.. నీ రేటెంత .. అంటూ అడగటం మొదలుపెట్టారు.
Women Safety In Hyderabad: వస్తావా.. నీ రేటెంత..? హైదరాబాద్ లో ఆకతాయిల బారినపడ్డ లేడీ ఐపీఎస్ ! వివాదంగా మారిన ఆపరేషన్

అలా అర్దరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3.30 గంటల వరకూ సుమారు మూడున్నర గంటలపాటు లేడీ ఐపీఎస్‌ను కొందరు పోకిరీలు తమ మాటలతో వేధించారు. రోడ్డుపై నడుకుంటూ వెళుతున్న ఆమెను బైక్ లతో అడ్డుపడుతూ, ఈ రాత్రికి వస్తావా.. అంటూ బేరాలు మొదలెట్టారు. అలా ఆకతాయిల  వేధింపులు భరిస్తూ , అక్కడున్న  పరిస్దితులను స్వయంగా గమనిస్తూ రోడ్డుపక్కన గంటలపాటు నిల్చుని రాత్రివేళల్లో మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా పరిశీలించారు మల్కాజిగిరి సీపీ సుమతి. 

మూడున్నర గంటలుగా అటువైపు ఏ ఒక్క పోలీసు కానిస్టేబుల్ రాలేదు. కనీసం పెట్రోలింగ్ వాహనం సైతం అటువైపు రాకపోవడంతో ఆకతాయిలు ఇంకా రెచ్చిపోయారు. బైక్ లపై చక్కర్లు కొడుతూ, ఒంటరి మహిళను వేధించడం ఆపలేదు. తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ అటుగా వచ్చి, కమిషనర్ వద్ద నిల్చున్నారు. మరికొద్దిసేపటికే ఓ ఎస్సై వచ్చి మఫ్టీలో ఉన్న ఐపీఎస్ అధికారి సుమతికి సెల్యూట్ కొట్టారు. పోలీస్ ఆ మహిళకు సెల్ల్యూట్ కొట్టడంతో అక్కడున్న ఆకతాయిలకు ఓక్కసారిగా గుండె ఆగినంత పనైంది. అసలు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు.


Women Safety In Hyderabad: వస్తావా.. నీ రేటెంత..? హైదరాబాద్ లో ఆకతాయిల బారినపడ్డ లేడీ ఐపీఎస్ ! వివాదంగా మారిన ఆపరేషన్

ఆమె ఒంటరి మహిళకాదు. వాళ్లు అనుకున్నట్లు సాధారణ మహిళ అంతకన్నాకాదు. ఆమె సివిల్ డ్రస్ లో ఉన్న ఐపీఎస్ అధికారిణి మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ అని తెలుసుకున్న పోకిరీలకు గుండె ఆగినంత పనైంది. ఇంకేముంది క్షణాల్లో పెట్రోలింగ్ వెహికల్ స్పాట్ కు రావడం, ఆమెను వేధించిన 40మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించడం చకచకా జరిగిపోయాయి. మరో పోలీసు వాహనంలో స్టేషన్ కు చేరుకున్న ఐపీఎస్ సుమతి , పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి రోడ్లపై ఒంటరి అమ్మాయిలను టార్గెట్ చేస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా పోలీసులకు చిక్కిన 40 మందిలో విద్యార్దులు, ఉద్యోగులతో పాటు గంజాయి సేవించిన బ్యాచ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా సాహోసోపేతమైన ఆపరేషన్లు చేయడం సుమతికి ఇప్పుడేం కొత్తకాదు. సరిగ్గా 25ఏళ్ల కిందట 2001లో డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్న వెంటనే కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా మఫ్టీలో వెళ్లినిల్చుని, వేధించడానికి వచ్చిన ఆకతాయిల భరతం పట్టారు. Women Safety In Hyderabad: వస్తావా.. నీ రేటెంత..? హైదరాబాద్ లో ఆకతాయిల బారినపడ్డ లేడీ ఐపీఎస్ ! వివాదంగా మారిన ఆపరేషన్

వివాదంగా మారుతున్న ఐపీఎస్ ఆపరేషన్..

ఇలా తెలుగు రాష్ట్రాల్లో లేడీ సింగం, ఐపీఎస్ అధికారిణి సుమతి ధైర్య సహసాలకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి.. హ్యాట్సాఫ్ మేడం అంటూ పొగడ్తలతో కామెంట్స్ , పోస్టులు పెడుతూ మల్కాజ్ గిరి కమిషనర్ చర్యలను మెచ్చుకున్నారు. అయితే ఇదే క్రమంలో ఆమెపై విమర్శలు, కౌంటర్లు కూడా అంతే స్దాయిలో వస్తున్నాయి. ఇవి కాదు మేడం , రాజకీయాల్లో అవినీతి చేసే నేతలను, తప్పులు చేసి తప్పించుకునే బడాబాబులకు శిక్షలు వేయండి అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget