అన్వేషించండి

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!

Hyderabad Latest News: హైదరాబాద్‌ మెట్రో ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, గత దశాబ్ద కాలంలో విస్తరణ జరగకపోవడంతో అది తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

Hyderabad Latest News: హైదరాబాద్‌ శరవేగంగా విస్తరిస్తోంది. పెరిగిన జనాభా, ఆదాయ మార్గాల మెరుగుదలతో ప్రతి ఇంట్లో కార్ల సంఖ్య పెరగడం నగరంలో ట్రాఫిక్ సమస్యను జటిలం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు, ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక బృహత్తరమైన వ్యూహాన్ని ప్రకటించింది. కేవలం రోడ్ల విస్తరణకే కాకుండా ఎలివేటెడ్‌ కారిడార్లు, మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ సుందరీకరణ వంటి ప్రణాళికలతో నగర రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన రోడ్డు మ్యాప్‌ను శాసన మండలి వేదికగా వివరించారు. 

ట్రాఫిక్ నియంత్రణకు బిగ్ ప్లాన్

హైదరాబాద్ నగర అభివృద్ధిని ప్రభుత్వం మూడు కీలక విభాగాలుగా వర్గీకరించింది. అవే క్యూర్, ప్యూర్, రేర్, 783 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌ను క్యూర్‌గా పరిగణిస్తున్నారు. ఇక్కడ సర్వీస్‌ సెక్టార్‌పై దృష్టి సారించనున్నారు. ప్యూర్ విభాగంలో ఇండస్ట్రియల్‌ సెక్టార్, రేర్‌ విభాగంలో అగ్రికల్చరల్‌ సెక్టార్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకి తరలించి, నగరాన్ని నివాసయోగ్యంగా మార్చాలని నిర్ణయించారు. పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, మేడ్చెల్ కార్పొరేషన్లు, నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. 

నలువైపులా ఎలివేటెడ్ కారిడార్లు- సిగ్నల్ లేని ప్రయాణం

నగరం నడిబొడ్డు నుంచి శివార్ల వరకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ నరం నుంచి విముక్తి కలిగించడానికి నాలుగు ప్రధాన జంక్షన్ల వద్ద ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గౌలిగూడ జంక్షన్, చాదర్ ఘాట్ జంక్షన్, నాగోల్‌, అంబర్‌పేట జంక్షన్‌లో ఈ కారిడార్‌లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుల వల్ల భూసేకరణ భారం తక్కువగా ఉండటమే కాకుండా వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగకుండా నేరుగా నగరం వెలుపలకి చేరుకోవచ్చు. 

ముఖ్యంగా మూసీ రిజువెనేషన్ ప్రాజెక్టులో భాగంగా హిమాయత్ సాగర్ జంక్షన్ నుంచి మూసీ నది వెంట గౌరవెల్లి వరకు సుమారు 43 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఈ మార్గంలో గౌలిగూడ, చాదర్ ఘాట్, అంబర్‌పేట, నాగోల్ జంక్షన్‌ వద్ద ట్రంపెట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చేస్తారు. నల్గొండ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందిగా మారిన నల్గొండ చౌరస్తా జంక్షన్‌ వద్ద ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇది జూన్ లేదా జులై నాటికి అందుబాటులోకి వస్తుంది. 

మెట్రో రైలు రెండో దశ 

హైదరాబాద్‌ మెట్రో ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, గత దశాబ్ద కాలంలో విస్తరణ జరగకపోవడంతో అది తొమ్మిదో స్థానానికి పడిపోయింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం 24వేల కోట్లతో మెట్రో రెండో దశను 76 కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రతిపాదించింది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా చేసుకొని, విమానాశ్రయానికి మెట్రో అనుసంధానం చేనున్నారు. నాగోల్, ఎల్బీనగర్‌ ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయగుట్ట, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో లైన్‌ పొడిగిస్తారు. 

పాతబస్తీ ప్రజల చిరకాల కోరిక మేరకు గౌలిగూడ వద్ద ఆగిపోయిన మెట్రో పనులను పునరుద్ధరించి ఫలక్‌నుమా, చాంద్రాయగుట్ట జంక్షన్‌ కనెక్ట్ చేయనున్నారు అలాగే ఐటీ ఉద్యోగుల కోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌, నియోపోలిస్‌ వరకు, బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపురం నుంచి చందానగర్ వరకు మెట్రోను విస్తరించనున్నారు. 


 

టాప్ హెడ్ లైన్స్

Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
Tiger Tension: వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Bharat Ratna for Manmohan Singh: దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చిన మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: కేంద్రానికి రేవంత్‌ రెడ్డి వినతి
దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చిన మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: కేంద్రానికి రేవంత్‌ రెడ్డి వినతి

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget