T Hub 2 Inauguration Live Updates: ప్రపంచ చరిత్రలో అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలో చూపరులను కట్టిపడేలా ఏర్పాటైన టీ హబ్ 2.0ను కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నిరంతర అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను క్లిక్ చేస్తూ ఉండండి.
LIVE
Background
హైదరాబాద్ చరిత్రలోనే ఐటీ రంగంలో సరికొత్త అధ్యయనానికి కాసేపట్లో శ్రీకారం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్ కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రారంభించున్నారు. హైదరాబాద్, రాయదుర్గంలో 3.14 ఎకరాల్లో రూ.400 కోట్లతో టీ హబ్ 2 నిర్మాణం జరిగింది. గతంలో టీ హబ్ వన్ నిర్మించిన తరువాత ఊహించని స్దాయిలో స్పందన రావడం, అందులోనూ టీ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీ లు ప్రారంభించాలనుకునే యువ ప్రారిశ్రామికవేత్తల సంఖ్య ఎక్కువ అయింది.
ఫలితంగా అంత మందికి అవకాశం అవకాశం కల్పించాలంటే అప్పట్లో సమస్యలు తలెత్తడంతో ఎమినిది వందల మంది లోపల ఉంటే వెయ్యి మంది స్టార్టప్ కోసం వేచిచూస్తున్న యువత బయట వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సి వచ్చేది. దీంతో టీ హబ్ టూ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా 2015లో టీ హబ్ 2 కు శంకుస్థాపన జరిగింది. కోవిడ్ క్లిష్ట పరిస్దితుల్లో సైతం టీ హబ్ నిర్మాణం వేగంగా జరిగింది. అత్యంత ఆకర్షణీమైన నిర్మాణంగా టీ హబ్ 2 నిలిచింది.
నిత్యం సమాజంలో ప్రజల అవసరాలు, సమస్యలు ఇలా వీటికి టెక్నాలజీ జోడించి పరిష్కారం చూపేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువకులకు టీ హబ్ అండగా నిలుస్తుంది. వారి ఆలోచనలకు మెరుగులు దిద్ది, ఆర్థిక చేయూతను అందించి వారిని స్టార్టప్ కంపెనీలు స్థాపించే విధంగా ప్రొత్సహిస్తుంది. ఇలా ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో టీ హబ్ 2 , తెలంగాణ ఐటీ రంగంలో దూసుకుపోనుంది. ఇప్పటికే టీ హబ్ వన్ ద్వారా 1,100 మంది యువకులు స్టార్టప్ కంపెనీలు స్థాపించుకోగలిగారు. ఆ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో టీ హబ్ 2 ముందుకు వెళ్లనుందని ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ఏబీపీ దేశంతో అన్నారు.
5.30 గంటలకు ప్రారంభం కానున్న టీ హబ్ 2 ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులు, ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ప్రముఖులు పాల్గొననున్నారు. యువత ఆలోచనలకు ప్రోత్సాహం ఎలా కల్పిస్తున్నారో.. స్టార్టప్ కంపెనీ సవాళ్లు, లక్ష్యాలు ఇలా అనేక అంశాలపై సమావేశాలు జరుగతాయి. 5 గంటలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీ హబ్ 2 అధికారికంగా ప్రారంభమవుతుంది.
Congratulations to the Government of Telangana and Chief Minister K. Chandrashekar Rao on its new T-hub facility in Hyderabad, which will be a great boost to the Indian startup ecosystem. https://t.co/XppHITrRl7
— Ratan N. Tata (@RNTata2000) June 28, 2022
టీ హబ్ 2.0 ప్రారంభోత్సవాన్ని ఈ లింక్‌లో చూడవచ్చు
హైటెక్ సిటీ ప్రాంతంలో టీహబ్ 2.0 ప్రారంభించిన ముఖ్యమంత్ర కేసీఆర్
ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ 2.0ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.3.14 ఎకరాల్లో దీన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. 2015లో దీన్ని తొలి దశలో టెక్నాలజీ హబ్‌గా ప్రారంభించారు.