News
News
X

Sathwik Suicide Letter: కన్నీళ్లు పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్ - అమ్మానాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్!

Sathwik Suicide Letter: శ్రీచైతన్య ఇంటర్మీడియట్ కళాశాల తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ సూసైడ్ లెటర్ ఏబీపీకి దొరికింది. అందులో ఏముందంటే..?

FOLLOW US: 
Share:

Sathwik Suicide Letter: హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మృతుడు సాత్విక్ చనిపోయే ముందు రాసిన సూసైడ్ లెటర్ ఏబీపీ దేశం తో ఉంది. అందులో "అమ్మానాన్న నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. కళాశాలలో ప్రిన్సిపల్ కళాశాల ఇంచార్జ్, లెక్చరర్లు పెట్టే టార్చర్ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని విద్యార్థి సాత్విక్ తన సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు. కృష్ణారెడ్డి ,ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులు తట్టుకోలేక పోయాను. నేను ఉంటున్న హాస్టల్లో వీరు ముగ్గురు కలిసి విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను వేధించిన ఈ ముగ్గురిపై యాక్షన్ తీసుకోండి. అమ్మానాన్న లవ్ యు , మిస్ యూ ఫ్రెండ్స్." అని రాశాడు. 

అసలేం జరిగిందంటే..?

మంగళవారం రాత్రి 10:30 సమయంలో సాత్విక్‌ అనే విద్యార్థి నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కళాశాల తరగతి గదిలోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కళాశాలలో పెట్టే ఒత్తిడి వల్లే అతడు చనిపోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్తే.. కనీసం ఆసుపత్రికి కూడా సిబ్బంది తరలించలేదని వివరించారు. దీంతో విద్యార్థులంతా కలిసి ఓ వాహనం లిఫ్టు అడిగి మరీ అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. కానీ ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ చనిపోయాడని వివరించారు. పోలీసులు, సాత్విక్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో సెక్షన్ 305 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో కాలేజీ క్యాంపస్ సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, హాస్టల్ వార్డెన్ నరేష్ పేర్లను చేర్చారు.

మార్కులు ఎక్కువ స్కోర్ చేయాలని టార్చర్

"సాత్విక్ మా ఫ్రెండ్. మార్కులు ఎక్కువ రావాలని కాలేజీ వాళ్లు ఎక్కువ టార్చర్ చేస్తున్నారు. అది తట్టుకోలేక వాడు అలా చేస్కున్నడు. ఒత్తిడి భరించలేక వాడు మాతో కూడా మాట్లాడట్లేదు. దీంతోనే నిన్న రాత్రి పదిన్నరకు సూసైడ్ చేస్కున్నడు." - షణ్ముఖ్, విద్యార్థి

మానసిక ఒత్తిడికి గురి చేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య

మరోవైపు సాత్విక్ తల్లిదండ్రులు కుమారుడి మృతి గురించి తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో లెక్చరర్లు కొట్టడంతో 15 రోజుల పాటు సాత్విక్ ఆస్పత్రి పాలయ్యాడని వివరించారు. లెక్చరర్లందరికీ తమ కుమారుడిని ఏం అనొద్దని చెప్పి మళ్లీ హాస్టల్ లో చేర్పించినట్లు ఏడుస్తూ తెలిపారు. మానసికి ఒత్తిడికి గురి చేయడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. కళాశాల యాజమాన్యమే విద్యార్థి మృతికి కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే శ్రీచైతన్య కాలేజీ ముందు ఆందోళనకు దిగిన క్రమంలో సాత్విక్ తల్లి కళ్లు తిరిగి పడిపోయారు. సాత్విక్ మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడిస్తామని పోలీసులు సాత్విక్ తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

Published at : 01 Mar 2023 06:33 PM (IST) Tags: Hyderabad News Telangana News Sathwik Suicide Case Sathwik Suicide Letter

సంబంధిత కథనాలు

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం

Hyderabad మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?: కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ

Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ