![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hyderabad Mayor: హైదరాబాద్‌లో BRS Vs BRS - మేయర్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు
ఉప్పల్ వద్ద ఉన్న చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
![Hyderabad Mayor: హైదరాబాద్‌లో BRS Vs BRS - మేయర్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు Hyderabad Mayor Gadwal Vijaya lakshmi faces bad experiance in chilka nagar uppal Hyderabad Mayor: హైదరాబాద్‌లో BRS Vs BRS - మేయర్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/20/05459e95bac34e6c167eb6f9420cea491671527545768234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మధ్యే వాగ్వివాదం చోటు చేసుకుంది. నగర మేయర్ విజయలక్ష్మికి ఇందులో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ దగ్గర స్థానిక ఎమ్మెల్యే వర్గానికి మేయర్ కు మధ్య వాగ్వివాదం జరిగింది. ఉప్పల్ వద్ద ఉన్న చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లేకుండా ఎలా శంకుస్థాపన చేస్తారంటూ స్థానిక బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
దీనిపై స్పందించిన మేయర్ ఆయనతో తనకు ఏం సంబంధమని ఎదురు సమాధానం ఇచ్చారు. దీంతో మేయర్ తో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ పాటించడంలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. అప్పటికే వారికి గట్టిగా సమాధానం చెప్పిన మేయర్.. బీఆర్ఎస్ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు.
Uppal mla #bethisubashreddy followers gives slogans against Hyderabad mayor #GADWALVIJAYALAKSHMI in uppal constituency.. pic.twitter.com/xU7jRLsntc
— SHRA..1 JOURNALIST✍ (@shravanreporter) December 20, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)